జొమాటో, స్విగ్గి వంటి సంస్థలు ఫుడ్ డెలివరీ రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తుండగా.. ముంబయిలోని డబ్బావాలా పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ముంబయిలో 5 వేలమంది డబ్బావాలాలు తమ కస్టమర్లకు హోమ్ మేడ్ ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. వాన వచ్చినా.. వరద వచ్చినా.. వారు మాత్రం తమ పనిని చేస్తూనే ఉంటారు. అందుకే ఈ డబ్బావాలా నెట్వర్క్ కి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ "మోడల్ ఆఫ్ సర్వీస్ ఎక్సలెన్స్" అంటూ కితాబిచ్చింది. కానీ కరోనా సమయంలో విధించిన కఠినమైన నిబంధనలు వల్ల వారంతా కూడా ఇక్కట్లు పడ్డారు. చాలామంది వేరే పనులు చూసుకోవడం ప్రారంభించారు. పని దొరకడం కష్టం కావడంతో కొందరు ఇంటికి వెళ్ళిపోయారు.



లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత చాలా మంది కస్టమర్లు ఇతరులను తమ అపార్ట్మెంట్స్, ఆఫీసుల లోనికి రానివ్వడం లేదు. చాలామంది డబ్బావాలా కార్మికులు ట్రైన్లపై పూర్తిగా ఆధారపడుతుంటారు. కానీ కరోనా సమయంలో లోకల్ ట్రైన్స్ నిలిపివేయడంతో వారి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. జొమాటో, స్విగ్గి వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీస్ లలో జాయిన్ కావాలంటే.. ఎంతోకొంత చదువు రావాల్సి ఉంటుంది. డబ్బావాలాలు తమకు ఫుడ్ డెలివరీ ఎలా చేయాలో తెలిసినా కూడా డిజిటల్ ఆర్డర్స్ రీడ్ చేయడం తెలియక ప్రముఖ కంపెనీలలో జాయిన్ కాలేకపోతున్నారు.



ముంబయి టిఫిన్ బాక్స్ సరఫరాదారుల సంఘం ప్రతి దబ్బవాలాకు రూ .2,000 చెల్లిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసినట్టు తెలిపారు. రోజుల తర్వాత డబ్బులు చెల్లించే విషయంలో ముంబయి సర్కారు మాట తప్పిందని టిఫిన్ బాక్స్ సంఘం ఆరోపించింది. రెండు వేల రూపాయలు లభించిన ఈ గడ్డు పరిస్థితులను డబ్బావాల ఉపశమనం కలిగేది. కానీ ఒక్కరి నుంచి కూడా సహాయం అందక పోవడంతో గిలగిల లాడుతోంది. ప్రపంచంలోనే బెస్ట్ సర్వీస్ గా పేరుపొందిన డబ్బావాలా వ్యవస్థ ఇప్పుడు పతనావస్థలో ఉండటం నిజంగా విషాదకరం. ఒకవేళ జొమాటో, స్విగ్గి సేవలు అందుబాటులో లేకపోయినట్లయితే ప్రజలందరూ డబ్బావాలా కార్మికులపై ఆధారపడేవారు. కానీ అలా జరగడం లేదు కాబట్టి ఇప్పుడు డబ్బావాలా కార్మికులు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: