ఇటీవలి కాలంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎప్పటికప్పుడు తమ సేవలను పునరుద్దిరిస్తున్నాయ్.  అయితే ఇటీవల కాలంలో వినూత్నమైన సేవలు అందించడం ఏమో కానీ  భారీగా చార్జీలు  పెంచి అన్ని బ్యాంకులు కూడా కస్టమర్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగం అనే తేడా లేకుండా అన్ని బ్యాంకులు కూడా భారీగా చార్జీలు పెంచి.. మొన్నటి వరకు ఉచితంగా అందించిన సేవలను సైతం ఇక ఇప్పుడు చార్జీల తో కూడిన సేవలు గా మార్చేసాయ్.  ఈ క్రమంలోనే ఖాతాదారుల అందరికీ కూడా షాక్ తగులుతుంది.



 ఇప్పటికే ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో దిగ్గజ బ్యాంకుగా కొనసాగుతున్న ఐసిఐసిఐ బ్యాంక్ తమ బ్యాంకు కస్టమర్లకు పలురకాల సేవలపై ఛార్జీలు వసూలు చేస్తుంది. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ నుంచి సర్వీస్ చార్జి  మారినట్లు తెలుస్తోంది. ఇక ఈ సర్వీస్ ఛార్జీలు తమ బ్యాంకు కస్టమర్లు అందరూ గమనించాలి అంటూ ఇటీవల ఐసిఐసిఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఏటీఎం, క్యాష్ విత్ డ్రా, చెక్ బుక్ లాంటి అన్ని సేవలకు కూడా చార్జీలు వర్తిస్తాయి అంటూ తెలిపింది ఐసిఐసిఐ బ్యాంక్. ఎటిఎం లో నెలకు కేవలం నాలుగు ఉచిత నగదు లావాదేవీలు అనుమతించి ఆ తర్వాత చార్జీలు వర్తిస్తాయి. మెట్రో నగరాల్లో అయితే కేవలం మూడు లావాదేవీలు మాత్రం ఇష్టంగా చేసుకునేందుకు  అవకాశం ఉంటుంది.



 ఇక ఐదు లావాదేవీల తర్వాత మళ్లీ ఏటీఎంలో లావాదేవీలు జరపాలి అనుకుంటే ఆర్థిక లావాదేవీలు 20 రూపాయలు ఆర్థికేతర లావాదేవీకి 8.50 రూపాయలు వసూలు చేస్తోంది ఐసిఐసిఐ బ్యాంక్. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు హోమ్ బ్రాంచి లో ఒక లక్ష వరకు నగదు లావాదేవీలు ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఇక లక్షకుపైగా లావాదేవీలు జరిపితే  ప్రతి లావాదేవీ పై కూడా వెయ్యి రూపాయలకు 5 రూపాయలు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక నాన్ హోమ్  బ్రాంచ్ లో కేవలం 25 వేల వరకు మాత్రమే క్యాష్ లావాదేవీలకు అనుమతి ఉంది. ఇక అంతకంటే ఎక్కువ లావాదేవీలు చెప్పితే  వెయ్యి రూపాయలు ఐదు రూపాయలు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక థర్డ్ పార్టీ లావాదేవీలపై పరిమితి కేవలం 25 వేల గా మాత్రమే ఐసిఐసిఐ నిర్ణయించింది. అంతకుమించిన లావాదేవీలు జరిపితే  150 రూపాయలు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరంలో 25 చెక్ లిప్స్ గల చెక్ బుక్ ఉచితంగా అందిస్తుంది. ఆ తర్వాత అదనంగా చెక్ బుక్ కావాలనుకుంటే 10 చెక్ లిప్స్ గల అదనపు చెక్ బుక్ కోసం 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: