కేంద్ర ప్రభుత్వం తమకు తోచినట్టుగా చేసుకుంటూ పోతోంది. దీనికి ఉదాహరణలే ప్రభుత్వానికి సంబంధించిన సంస్ధలను ప్రైవేటీకరణ చేయడం. ఈ నిర్ణయంతో దేశ ప్రజలు మరియు రాజకీయ పార్టీలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అంతా వారిని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ వరుసగా అమ్ముకుంటూ పోతోందంటూ అంటున్నారు. తద్వారా దేశంలో విదేశీ పెట్టుబడుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లుగా అర్ధమవుతోంది. ఇంతకు ముందు ఎల్ఐసిని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు అమ్మేసినట్టే. గత బడ్జెట్ మీటింగ్ లో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పిన విధంగానే మోదీ ప్రభుత్వం వ్యవహారాలన్నీ చేస్తోందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ప్రస్తుతం పెట్రోలియం కంపెనీలను సహా అమ్మడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
దీని కోసం విదేశీయులు మన దేశంలోని ఆయిల్ గ్యాస్ కంపెనీల్లో వంద శాతం పెట్టుబడులు పెట్టవచ్చని, దానికి సంబంధించిన అనుమతులను ఇచ్చేసింది. అయితే ఇక్కడ 100 శాతం అనేటప్పటికీ, పెట్టుబడులు పెట్టడం అనే మాట పక్కన పెట్టి...వారిక ఆ కంపెనీలకు యజమానులు కిందే లెక్క. మన దేశంలో పెట్రోలియం కంపెనీలలో అతి పెద్దది భారత్ పెట్రోలియం కార్పొరేషన్. ఈ పెట్రోలియం కంపెనీకి సంబంధించిన 52.98 శాతం వాటాలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఈ వాటాలను అమ్మడానికి సర్వం సిద్ధం అయినట్లే తెలుస్తోంది.
 ఈ కంపెనీని కొనడానికి ఇప్పటికే ఆయా విదేశీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయట. ఈ కంపెనీని అమ్మేస్తే తరువాత oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంతు వస్తుంది. ఇలా ఆఖరికి మానవునికి అత్యవసరమయిన ఇంధన కంపెనీలను కూడా అమ్మేస్తే, ఇప్పటికే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ, విదేశీయులు రానున్న కాలంలో ఎంత పెంచినా కేంద్రం అడగలేని పరిస్థితిలో ఉంటుంది. ఎటు తిరిగి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: