కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరిహద్దు దేశాలు అన్నింటితో కూడా ఎంతో సత్సంబంధాలు కొనసాగించే దిశగా అడుగులు వేస్తోంది. ఓ వైపు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఇక అన్ని దేశాలతో  దౌత్యపరమైన వాణిజ్యపరమైన బంధాలను ఏర్పరచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇక అన్ని దేశాలతో భారత్ సంబంధాలు మెరుగు పరుచుకుంటూనే ఉంటుంది. ఇక ఇటీవలే బంగ్లాదేశ్తో ఒక దౌత్యపరమైన ఒప్పందానికి సిద్ధమయింది భారత్. ఇటీవలే బంగ్లాదేశ్ భారత్ మధ్య గూడ్స్ ట్రైన్స్ నడిపేందుకు సిద్ధమైంది భారత్.



 బంగ్లాదేశ్ భారత్ మధ్య రైలు సౌకర్యం దాదాపు 40 ఏళ్ల నుంచి ఉంది.  కొన్ని వివాదాలు వచ్చినప్పుడు ఈ రైలు ఆగిపోవడం.. వివాదం సద్దుమణిగిన తరువాత మళ్ళీ యధావిధిగా తిరగడం జరుగుతూ ఉంటుంది.  అయితే ఇలా ప్రయాణికులను తరలించే రైలు సౌకర్యం బంగ్లాదేశ్ భారత్ మధ్య ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఇక రవాణా పరమైన గూడ్స్ రైళ్లను మాత్రం ఇప్పటివరకు బంగ్లాదేశ్ భారత్ మధ్య ప్రారంభం కాలేదు. ఈ క్రమంలోనే నెలకు ఇరవై రోజుల పాటు బంగ్లాదేశ్ భారత్ మధ్య గూడ్స్ రైలు తిరిగేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.  ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 సాధారణంగా భారత్ గోధుమలు, పంచదార సహా మరికొన్ని రకాల ఆహార పదార్థాలను  బంగ్లాదేశ్ కి ఎగుమతి చేస్తూ ఉంటుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ నుంచి మరికొన్ని రకాల ముడి సరుకులు పలు ఆహార పదార్థాలను కూడా భారత్ దిగుమతి చేసుకుంటుంది.  మొన్నటి వరకు కేవలం విమానాల ద్వారా మాత్రమే ఇరు దేశాల మధ్య ఈ రవాణా జరిగేది. కానీ విమాన రవాణా  ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఇక ఇటీవలే ఇరుదేశాల మధ్య రైలు మార్గాన్ని ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఒక వైపు ఖర్చును తగ్గించడమే కాకుండా సులభతరంగా అధిక ఎగుమతులు దిగుమతులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇక ఈ గూడ్స్ రైలు ప్రారంభించింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: