దీంతో వెంటనే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమై లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చాయ్. దీంతో ప్రజలందరూ ఇంటిపట్టునే ఉండేవిధంగా చర్యలు తీసుకున్నాయి. తద్వారా క్రమక్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే దేశం సెకండ్ వేవ్ ప్రభావం నుంచి బయట పడుతుంది. దీంతో దేశ ప్రజానీకం మొత్తం ఊపిరి పీల్చు కుంటుంది. కానీ అంతలోనే మళ్ళీ మూడవ దశ కూడా దూసుకు వస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందరూ థర్డ్ వేవ్ కరోనా వైరస్ తో పోరాటం చేసేందుకు ప్రజలు అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రజలందరిలో భయం పట్టుకుంది.
థర్డ్ వేవ్ ఫై ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలుమూడవ దశ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. ఇక దీని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నారు. ఇక ఇటీవల ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ మాత్రం మూడవ దశ కరోనా ప్రభావం గురించి కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ప్రభావం ఉంటుందని ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు దీని ప్రభావం కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఈసారి సెకండ్ వేవ్ లాగా భారీ ఎత్తున వైరస్ సోకే ప్రమాదం మాత్రం తక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అంతగా ప్రభావం ఉండకపోవచ్చని దీంతో ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడే అవకాశం లేదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి