అంతటి రాజకీయ చతురత కలిగిన చంద్రబాబు .. అంతటి అనుభవం కలిగిన ఆ చంద్రబాబు .. ఇప్పుడు మాత్రం ఆ కాలిక్యులేషన్స్ తో ముందుకు సాగడంలేదు అన్నది తెలుస్తుంది. కరోనా టైం లో చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాలు మాత్రం తెలుగు తమ్ముళ్లలో పెద్ద మార్పు తీసుకువచాయా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రాజకీయాలు అంటే ఇక పార్టీ అధినేత ప్రజల్లోకి వెళ్లి మాట్లాడి నప్పుడే అటు కార్యకర్తల్లో కూడా ఉత్తేజం నిండి పోతూ ఉంటుంది. పార్టీ కోసం మరింత కష్టపడాలి అనే సంకల్పం పెరుగుతుంది. అదే పార్టీ అధినేత ఇంటి పట్టునే ఉండి జూమ్ మీటింగ్లలో ఇలా చేయాలి అలా చేయాలి అని చెబితే కార్యకర్తలు కూడా లైట్ తీసుకుంటారూ. ఇప్పుడు టిడిపిలో ఇదే జరుగుతుంది అని తెలుస్తోంది.
కరోనా వైరస్ కు భయపడి చంద్రబాబు కేవలం జూమ్ మీటింగ్ లకు మాత్రమే పరిమితం అయ్యారు. అటు ప్రజల్లోకి వెళ్లడం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం లాంటివి చాలా తక్కువే. నారా లోకేష్ ప్రజల్లోనే ఉంటున్నప్పటికీ ఎంతైనా చంద్రబాబు చంద్రబాదే కదా. ఇలా తమతో పాటు ఉండాల్సిన అధినేత కేవలం జూమ్ మీటింగ్ కు మాత్రమే పరిమితం కావడంతో ఇక మనం కూడా కరోనా టైంలో రిస్క్ చేయడం ఎందుకు అని తెలుగు తమ్ముళ్ళు కూడా ఇంటి పట్టునే ఉండి పోతున్నారట. దీంతో పార్టీ కోసం పోరాటం చేయటం.. అధికార పార్టీ ఆగడాలను బయటకు తీసుకురావడంపై అంతగా ఆసక్తి చూపించడం లేదని.. ఇలా చంద్రబాబు వ్యూహం తెలుగు తమ్ముళ్లు చాలానే మార్పు తీసుకు వచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి