సాధారణంగా మొక్కలను ఎక్కడ పెంచుతూ ఉంటారు..  కొత్తగా అడుగుతారు ఏంటండి భూమి మీదే కదా మొక్కలను పెంచేది అని చెబుతారు ఈ ప్రశ్న అడిగితే ఎవరైనా... అయితే ఇటీవలి కాలంలో ఎంతోమంది రసాయనాలతో కూడిన కూరగాయలు పండ్లను తినకూడదు అనే ఉద్దేశంతో ఇంటి రూఫ్ పైనే మట్టి లో కూరగాయల మొక్కలు పెంచడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు.  ఇలా మొక్కల పెంపకంలో ఎంతో వినూత్నంగా ఆలోచిస్తూ అపుడపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ కనీవినీ ఎరుగనిది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇప్పటివరకు భూమి మీద మొక్కలు పెంచుతారు అని తెలుసు..  ఇక కొంతమంది ఇంటి రూఫ్ మీద మట్టి లో కూరగాయల మొక్కలు పెంచడం లాంటివి కూడా చూసామ్..  కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కార్లపై కూరగాయల మొక్కలు పెంచడం మొదలు పెట్టారు. కార్ల మీద కూరగాయల మొక్కలు పెంచడం అంటే వినడానికి కాస్త విచిత్రంగా ఉందే అని అంటారా..  విచిత్రం కాదు వినూత్నమైన ఐడియా.  ఏకంగా వేల కార్లపై కూరగాయల మొక్కలు పెంచడం మొదలు పెట్టారు ఇక్కడ. ఈ ఘటన థాయిలాండ్ లో వెలుగులోకి వచ్చింది.



 థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్లో రోడ్లు నిత్యం రద్దిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  కానీ ప్రస్తుతం కోవిడ్ నిబంధనల వల్ల రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి  ఇక ఆటో టాక్సీ డ్రైవర్ల కు ఎలాంటి గిరాకీ లేదు అని చెప్పాలి. దీంతో ఎంతో మంది టాక్సీ డ్రైవర్లు గ్రామాలకు వెళ్లి పోయారు. అయితే ఇందులో చాలామంది టాక్సీని ఇక్కడే వదిలేసి వెళ్లిపోవడం గమనార్హం  ఇలా టాక్సీ డ్రైవర్లు వదిలేసి వెళ్లిన టాక్సీ రూఫ్ లపై ఓ సంస్థ మట్టి నిలువ ఉండేలా చేసి కూరగాయలు పెంచడం మొదలు పెడుతుంది. అయితే ఇప్పటికే ఇలా వదిలి వెళ్ళిన టాక్సీ లలో చాలా కార్లు పాడైపోయాయి అని అందుకే తాము మొక్కల పెంపకం చేపట్టినట్లు సదరు సంస్థ తెలిపింది  ఏమైనా ఐడియా మాత్రం భలే ఉంది అని అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Car