
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ కు దూరమైన ఆయన సైలెంట్ అయ్యారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబును కలిసి కొంత హడావిడి చేశారు. అయితే 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో ఆయన చేసిన సర్వే బూమరాంగ్ అయ్యింది. అప్పటి వరకు ఆయన సర్వేలను నమ్మే ప్రజలు ఆయనపై నమ్మకం కోల్పోయారు. చివరకు 2019 ఎన్నికల లో కూడా ఆయన సర్వే ఏపీలో రివర్స్ అయ్యింది. ఆ తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇక వచ్చే ఎన్నికలలో విజయవాడ టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని తాను పోటీ చేయనని చంద్రబాబు చెప్పారని వార్తలు వస్తున్నాయి.
నాని తీరుతో టీడీపీ నేతలతో పాటు పార్టీ అధిష్టానం కూడా విసిగి పోయి ఉంది. ఆయన ఒంటెద్దు పోకడలపై నగరానికి చెందిన కొందరు పార్టీ నేతలు కార్పొరేషన్ ఎన్నికల సమయం నుంచి గుస్సాతో ఉన్న సంగతి తెలిసిందే. నాని తప్పుకోవడంతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున లగడపాటి రాజగోపాల్ ను విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమ మరి కొందరు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే లగడపాటి ఒప్పు కోవాలే కాని విజయవాడ టీడీపీ ఎంపీ టిక్కెట్ ఖచ్చితంగా ఆయనకే దక్కుతుంది.
ఆయనకు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతంలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉండటమే ఇందుకు కారణం. ఇక ఆయన గెలుపు విషయంలో కూడా పెద్దగా సందేహాలు అవసరం లేదేమో ? మరి ఆయన ఒప్పుకుంటారా ? లేదా ? అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్ ?