ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ ఎప్పుడూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో ముందు ఉంటుంది. ప్రపంచంలో తమ అంత బలమైన దేశం ఏది లేదని  గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది.  అయితే ఇలా మేకపోతు గాంభీర్యానికి పోయి అటు ఐక్యరాజ్యసమితిలో ఎప్పుడు చులకన అవుతూనే ఉంటుంది పాకిస్తాన్.  ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ లో మారణహోమం సృష్టించడమే లక్ష్యంగా ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటుంది పాకిస్తాన్. కేవలం భారత్లో మాత్రమే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఉగ్రవాదులతో ఇప్పటికే ఎన్నో  మారణహోమాలు సృష్టించింది.  ఇలా ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో మాత్రం శాంతి వచనాలు వల్లిస్తూ ఉంటుంది.



 ప్రజాస్వామ్యం అనే పదానికి అసలు సిసలైన కేరాఫ్ అడ్రస్ గా ఉన్న భారత్ కి ఐక్యరాజ్యసమితి వేదికగా శాంతి వచనాలు వల్లిస్తూ సలహాలు ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది పాకిస్తాన్.  అయితే ఒకప్పుడు పాకిస్తాన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అంటూ సున్నితంగానే తిరస్కరించేది భారత్. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దానికి దీటుగా సమాధానం చెబుతుంది. ఇక ఇటీవల ఐక్యరాజ్యసమితిలో మరోసారి పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చింది భారత్.  ఇటీవలే ఐక్యరాజ్యసమితి వేదికగా సమావేశం జరిగింది.  ఈ సమావేశం జరిగినప్పుడల్లా అటు కాశ్మీర్ అంశాన్ని తెరమీదికి తెస్తూ ఉంటుంది పాకిస్తాన్.


 ఇక ఇటీవల మరోసారి ఐక్యరాజ్యసమితి సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది పాకిస్తాన్. ఈ క్రమంలోనే అటు పాకిస్థాన్ కి భారత్ గట్టిగా బదులిచ్చింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి అడ్డాగా మారిన దేశం నుంచి సహకారం ఆశించలేము అంటూ తేల్చి చెప్పింది భారత్. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసింది భారత్. పాకిస్థాన్కు చెందిన రాయబారి ఈ సమావేశంలో జమ్మూకాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.. స్పందించిన భారత దౌత్యవేత్త అమర్నాథ్ పాకిస్తాన్ తీరును తీవ్రస్థాయిలో ఖండించారు.  పాకిస్తాన్ నుంచి సలహాలు భారత్ కు అక్కర్లేదు అంటూ తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: