ఓలిశర్మ అధికారంలో ఉన్నప్పుడు చైనా బహిరంగంగానే ఆక్రమణలకు పాల్పడింది. అప్పట్లో స్థానికంగా ఉన్న సరిహద్దు గ్రామాలను బెదిరించి అక్కడి వారితో పత్రాలపై సంతకాలు చేయించుకుంది చైనా. తాజాగా ఈ పత్రాలను అడ్డుపెట్టుకుని ఆయా గ్రామాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆయా గ్రామాలలో సైన్యం వచ్చి కంచలు వేసుకెళ్తున్నారు. ఇదేమిటని అడిగితే ఇది మాదే, మీరే కబ్జా చేశారు, అంటూ ఆనాటి పత్రాలు చూపిస్తున్నారు. ఇలా చైనా బలహీనమైన, యుద్ధం చేయలేని దేశాలపై దురాక్రమణలకు పాల్పడుతూ ఇష్టానికి దాష్టికాలు చేస్తుంది. ప్రస్తుతం దాని కన్ను తైవాన్, భారత్ పై ఉన్నప్పటికీ దానికి వీలు పడకపోతుండటంతో బలహీనమైన సరిహద్దు దేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ తరహా ఆక్రమణలకు పాల్పడుతుంది.

నేపాల్ ప్రభుత్వం కూడా చైనా తో యుద్దానికి వెళ్లే పరిస్థితి కాదు కాబట్టి ఊరికే చూస్తూ ఉండటం తప్ప మరొకటి చేయలేకపోతోంది. నిజానికి నేపాల్ లో ప్రత్యేక ప్రభుత్వం తరహా ఏర్పాటు ఉన్నప్పటికీ దాని రక్షణ బాధ్యతలు భారత్ చూసుకునేది. కానీ ఇటీవల చైనా మాటలు విని ఆ దేశం కూడా భారత్ పై విముఖత వ్యక్తం చేయడంతో స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనితో ఇప్పుడు భారత్ పై ఉన్న కసితో చైనా నేపాల్ ను ఆక్రమించడం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇంకా చైనా బుద్ధి తెచ్చుకునే ప్రయత్నాలు కాకుండా రెచ్చగొట్టే ప్రయత్నాలే చేస్తుంది.

కరోనా సమయంలో ఒక్క దేశం సంయమనం విడిచిపెట్టినా అందరు కలిసి చైనాపై పడి దానిని ప్రపంచ పటంలో లేకుండా చేసేవారు. అంత ఘోరంగా వైరస్ ను వ్యాప్తి చేసి, ప్రపంచ ఆధిపత్యం కోసం పాపం మూటకట్టుకుంది చైనా. ఇవన్నీ తెలిసినా ఒకవైపు కరోనా తో పోరాడుతూ, మళ్ళీ చైనాతో పోరాడటం ఎందుకు, తరువాత చూసుకుందాం అని ప్రపంచదేశాలు సర్దుమణిగాయి. అయినా చైనా బుద్ది మార్చుకోకుండా, దాని దురాక్రమణలు, భారత్ ను మానసికంగా వేదించే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక్కనాటికి ఇలాంటి దేశాలు లేదా నేతలు సరి అవరు, వాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం అసలు తప్పేమీ కాదు. కనీసం ఆ దేశంలో ప్రజలైన అతడి అనంతరం స్వేచ్ఛగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని బ్రతుకుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: