కాంగ్రెస్ నేత కొండా మురళీ జీవిత కథ ఆధారంగా సినిమా చేస్తున్న నేపధ్యంలో ఇది సంచలనాలకు వేదికగా మారే అవకాశం ఉందనే దానిపై అందరిలో ఒక ఆసక్తి అయితే ఉంది. ఇక ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ ఏ విధంగా చూస్తారు, మంత్రి ఎర్రబల్లి దయాకర్ కు వ్యతిరేకంగా ఉంటుందా అనేది కూడా చర్చ జరుగుతుంది. సినిమా షూటింగ్ కోసం ఏలూరు విచ్చేసిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా నేపథ్యం ఉన్న కొండా సినిమా షూటింగ్ జిల్లాలో చేయనున్న రామ్ గోపాల్ వర్మ... 15 రోజుల పాటు షూటింగ్ చేసే అవకాశం ఉందని అన్నారు.

కొండా సినిమా షూటింగ్ నిమిత్తం ఏలూరు మొదటి సారి వచ్చాను అని ఆయన తెలిపారు. వరంగల్  లో ఆధారిత కధనం అని పేర్కొన్నారు. అక్కడ తరహా లోకేషన్లు,  అడవులు ఇక్కడ ఉండడంతో  షూటింగ్ చేపడుతున్నాము అని ఆయన తెలిపారు. ఏపీ పాలిటిక్స్ ఎక్కడ అయిపోయాయి.. ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాయి కదా..  ఇంకా జరుగుతున్నాయి  అని అన్నారు ఆయన. మళ్ళీ వస్తాం.. అక్కడ( తెలంగాణా) అయిపోయాక ఇక్కడకు వస్తాం అని తెలిపారు. మా అసోసియేషన్ ను సర్కస్ తో పోల్చడంపై స్పందించిన  రామ్ గోపాల్ వర్మ..

మీడియానే వివాదం చేస్తున్నది  అని వర్మ అన్నారు. మనోజ్ రింగ్ మాస్టర్ అని అన్నాడు.. నేను మంకీ అని చెప్పా.. అదేదో అయిపోయింది అని ఆయన పేర్కొన్నారు. కానీ అందరూ సర్కస్ అనే ప్రూవ్ చేసారుగా  అని ఎద్దేవా చేసారు. బోస్ డికే పదంపై స్పందించడానికి నిరాకరించారు ఆయన. అందరూ అన్నప్పుడు నేను  కూడా అనడంలో తప్పేమీ ఉంది అని ఆయన ప్రశ్నించారు. ఆ పదం నా నోటితో చెప్పించి మళ్ళీ మీరే వివాదం చేస్తారు అని ఆర్జీవీ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv