హుజురాబాద్ వేట అంతిమ దశకు చేరుకున్నా కొద్దీ ఆట మరింత రసవత్తరంగా మారుతోంది. కొత్త కొత్త ఎత్తులు, సరికొత్త ప్రచార వ్యూహాలు నెక్స్ట్ లెవెల్ ను తలపిస్తున్నాయి. గెలుపు మలుపు ఎవరిది..? ఎవరి మెడలో వీరమాల పడబోతుంది..? మొన్నటి వరకు ఎవరికీ ఎండ్  ఉంది ఇప్పటినుంచి ఎవరికి ఛాన్స్ పెరుగుతోంది..? హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడే కొద్ది వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎత్తులు, పై ఎత్తులు  వేడెక్కుతున్నాయి. ప్రచారమైతే కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఎవరు అవునన్నా కాదన్నా ఈ బై పోల్ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మద్యే కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ బరిలో ఉన్న నామమాత్రమే అన్నట్టుగా అక్కడ చర్చ జరుగుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మక పోరులో ఎవరి వ్యూహాలు ఏంటి..? ఏఏ అంశాలు, ఏ ఏ స్ట్రాటజీలతో ఎవరి మెడలో వీరతాడు పడబోతోందన్న అంశాలపై హుజురాబాద్  గ్రౌండ్ లో జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ తో విభేదాలతో గులాబీ దళాన్ని వదిలి కమలం చెంతకు చేరిన ఈటెల తన అవమానానికి ప్రతీకారంగా గెలుపుతో బదులివ్వాలని కసిమీద ఉన్నారు. అహంకారానికి ఆత్మగౌరవానికి పోరాటం అంటూ చర్చను రేకెత్తించారు.

రెండు దశాబ్దాలు పార్టీకి నమ్మినబంటుగా ఉన్న తనను అత్యంత అవమానకర రీతిలో బయటకు పంపారని కేసులతో వేధిస్తున్నారని ప్రతిచోటా మాట్లాడుతున్నారు. సానుభూతి అస్త్రాన్ని ఆయన నమ్ముకున్నారు. దీనికితోడు బీజేపీ అండ దండ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రచారం తన విక్టరీకి మరింత తోడ్పడుతుందని అనుకుంటున్నారు. మరోవైపు టిఆర్ఎస్ మరింత ధాటిగా ప్రచారం చేస్తోంది. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు బాధ్యతను భుజాల మీద వేసుకున్న హరీష్ రావు రకరకాల అంశాలతో ఈటెల రాజేందర్ పైకి ఈటెలు విసురుతున్నాడు. ఎక్కడ సభ పెట్టిన సిలిండర్ ను ముందు పెట్టి బిజెపి ప్రభుత్వం సిలిండర్ రేటు అమాంతం పెంచేసిందని  విమర్శిస్తున్నారు. కార్యకర్తలు సైతం సిలిండర్ తో నిరసనలు తెలుపుతున్నారు. ఈటల ఎందుకు రాజీనామా చేశారన్న అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు.అటు ఈటెల మాత్రం సానుభూతి, నియోజకవర్గంలో పలుకుబడి, అభిమానం, విజయానికి బాటలుగా భావిస్తున్నారు. ఎవరికి వారే విక్టరీపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం ముగిసే సమయానికి మాటల యుద్ధం పీక్స్ కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఎవరి వాదనను జనం ఆమోదిస్తారు..? ఎవరికి పట్టం కడతారో ప్రతిష్టాత్మక యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: