ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు ఏ రేంజిలో పెరిగిపోతున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సంవత్సరం కాలంలోనే సామాన్యుడికి ఊహకందని రీతిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయ్. అయితే పెరిగిపోయిన పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకీ సామాన్యుడికి భారంగా నే మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒకవైపు కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు గుదిబండలా గా మారిపోయాయి. అయితే ఇప్పటికే సెంచరీ దాటిపోయి అంతకంతకు పెరిగిపోతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు.


 పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పాలి.అదే సమయంలో ఇక పెట్రోల్ ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై కూడా ప్రస్తుతం అందరూ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేయాలని ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో అటు మార్కెట్లోకి వినూత్నమైన టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రానిక్ వాహనాలను తీసుకువచ్చేందుకు ఆయా కంపెనీలు కూడా సిద్ధమవుతున్నాయి.


 తక్కువ ధర తోనే వందల కిలోమీటర్లు ప్రయాణించే విధంగా ఎలక్ట్రికల్ స్కూటర్ లను తయారు చేస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యూ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే సాధారణంగా బీఎండబ్ల్యూ కార్ అంటే ఇక మిగితా అన్ని కార్లతో పోల్చి చూస్తే ధర కూడా భారీగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బిఎండబ్ల్యూ కంపెనీ తయారుచేసిన ఎలక్ట్రికల్ స్కూటర్ ధర ఎనిమిది లక్షలు గా నిర్ణయించి. కేవలం అరగంటలోనే ఫాస్ట్ ఛార్జింగ్ అవడమే కాదు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ వరకు ప్రయాణించవచ్చు. అంతేకాదు ఇక అత్యధిక స్పీడ్ గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉంటుందట. మరికొన్ని రోజుల్లో ఇక ఎలక్ట్రికల్ స్కూటర్ లు అందుబాటులోకి రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: