గుండు సూది దగ్గర నుంచి తుపాకీ గుండు వరకు ఏది కావాలన్నా విదేశాలపై ఆధారపడటం వచ్చింది భారత్. రక్షణ రంగంలో కావాల్సిన ప్రతి చిన్నవస్తువుకి కూడా విదేశాలకు కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తూ వచ్చేది. కానీ ఇటీవలి కాలంలో భారత్ ఎంతో దూకుడు పెంచింది. ఆయుధాల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడడం కాదు స్వదేశంలోనే ఆయుధాలను తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే  భారత ప్రభుత్వం నుంచి భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవోకి పూర్తిస్థాయి మద్దతు అందుతు ఉండడంతో ఎంతో అధునాతనమైన ఆయుధాలను తయారు చేస్తున్న drdo వాటికి ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేరుస్తుంది.


ఇలా ఇప్పటివరకు పదికిపైగా క్షిపణులను భారత రక్షణరంగ పరిశోధన సంస్థ తయారు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక drdo తయారుచేసిన ఆయుధాలను భారత రక్షణ రంగంలో ఉపయోగించడమే కాదు అటు విదేశాలకు సైతం విక్రయించటం మొదలు పెట్టింది ఇండియా. ఇలా ప్రపంచ దేశాలకు షాకిస్తూ వస్తుంది భారత్. ఇలా వరుసగాడి ఆర్ డి ఓ సరికొత్త ఆయుధాలను తయారు చేస్తూ ఉండటం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు మరో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ.


 ఇప్పటికే వినూత్నమైన ఆయుధాలు ఆవిష్కరించేందుకు drdo ఎన్నో ప్రయోగాలు నిర్వహిస్తుంది.  ఈ ప్రయోగాల్లో ఒక ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది.100% దేశీయంగా తయారు చేయబడి నటువంటి ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్  రాడార్ సిస్టం సక్సెస్ అయింది. ఇక ఈ ఈ డిఫెన్స్ కంట్రోల్ సిస్టం కి ఎయిర్ డిఫెన్స్ గన్స్ అమర్చి ఉంటాయి. ఇక ఈ డిఫెన్స్ సిస్టం భారత్ మీదికి వచ్చే యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను కూడా 100% కచ్చితంగా గుర్తించేందుకు సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. ఇలా భారత్ మీద దాడి చేయడానికి వస్తున్న యుద్ధ విమానాలు క్షిపణులు డ్రోన్లను కూడా ధ్వంసం చేస్తుందట డిఫరెంట్ సిస్టం.. ఇలా అగ్రరాజ్యాల దగ్గర మాత్రమే ఉన్న ఇలాంటి డిఫెన్స్ సిస్టం ఇటీవల డి ఆర్ డి ఓ దేశీయంగా తయారు చేయడం గొప్ప విజయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: