ప్రస్తుతం ప్రపంచ అగ్రదేశాలు లో ఒక దేశంగా కొనసాగుతుంది బ్రిటన్. ఇలా ప్రపంచ అగ్రరాజ్యంగా కొనసాగుతున్న బ్రిటన్ కు గత కొంత కాలం నుంచి గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చైనా నుంచి కరోనా వైరస్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా శరవేగంగా పాకిపోయింది. ఈ క్రమంలోనే  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలలో మొదటి స్థానంలో నిలిచింది బ్రిటన్. ఇక మొదటి దశ కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అంతలోనే రెండవ దశ కరోనా వైరస్ కూడా ముంచుకొచ్చింది.


 దీంతో మళ్లీ బ్రిటన్లో కరోనా వైరస్ కారణంగా పెను సంక్షోభమే  ఏర్పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే రెండవ దశ కరోనా వైరస్ నుంచి అతి కష్టం మీద కోలుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం బ్రిటిష్ ప్రభుత్వానికి కోలుకోలేని విధంగా ఎన్నో రకాల సంక్షోభాలు ఎదురుదెబ్బ కొడుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో బ్రిటన్ లో భారీగా సామాజిక ఉద్యమాలు జరుగుతూ ఉండటం కూడా సమస్యాత్మకంగా మారిపోయింది . ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బ్రిటన్ వ్యవస్థలో ఎన్నో రకాల అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుతం బ్రిటన్లో మరో కొత్త సంక్షోభం కూడా ముంచు కొచ్చేసింది. వాహనాల విక్రయం భారీ ఎత్తున పడి పోయింది. ఈ విధంగా 41% వాహనాల విక్రయాలు ఒక్కసారిగా దెబ్బతినడం తో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుంది . ఒకవైపు సెమి కండక్టర్స్ షిప్ లేక పోవడం వల్ల తయారు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అంతే కాకుండా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇక బ్రిటన్ నుంచి కార్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఇక బ్రిటన్లో ఏకంగా కార్ల విక్రయాలు ఒక్కసారిగా 41% పడిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: