టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడకక్కడ పార్టీని సెట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పార్టీని మళ్ళీ గాడిలో పెట్టి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు. ఇక పార్టీని గాడిలో పెట్టడానికి బాబు ఏ మాత్రం మొహమాట పడటం లేదు. పనిచేయని నాయకులని నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు. అలాగే యాక్టివ్ గా లేని నాయకులని సైడ్ చేసి..కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అసలు పార్టీలో పనిచేయని నేతలకు నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు.

ఇలా పార్టీని సెట్ చేస్తున్న బాబు...కావలి నియోజకవర్గంలో టీడీపీని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగానే కావలి అంటే టీడీపీకి కలిసి రాని  నియోజకవర్గం. ఇక్కడ పార్టీ పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు. గత రెండు ఎన్నికల్లో అయితే కావలిలో పార్టీ ఘోరంగా ఓడిపోతూ వస్తుంది. పైగా ఇప్పుడు అక్కడ టీడీపీని బలోపేతం చేసే నాయకులు కనిపించడం లేదు. సీనియర్ నేత బీదా మస్తాన్ రావు సైతం పార్టీని వీడటంతో నియోజకవర్గంలో పార్టీకి అనుకూల పరిస్తితులు లేవు.

2009లో బీదా..కావలి నుంచి గెలిచిన విషయం తెలిసిందే. 2014లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో బీదాని నెల్లూరు పార్లమెంట్ బరిలో దింపగా, కావలిలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని బరిలో దింపారు. అయితే జగన్ వేవ్‌లో ఇద్దరూ ఓడిపోయారు. ఓడిపోయాక బీదా టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయారు.

కావలిలో బీదా వర్గం కూడా వైసీపీ వైపుకు వెళ్లింది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ మరింత వీక్ అయింది. పైగా కాటంరెడ్డి సైతం దూకుడుగా పనిచేయడం లేదు. దీంతో కావలిలో టీడీపీ క్యాడర్ చెల్లాచెదురయ్యే పరిస్తితి. అయితే బీదా సోదరుడు బీదా రవిచంద్రయాదవ్ టీడీపీలోనే ఉన్నారు. కావలిలో కొందరు టీడీపీ కార్యకర్తలు...ఆయనకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు ఇంతవరకు కావలి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి త్వరలోనే కావలిలో పార్టీని సెట్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: