మాజీ సీఎం అఖిలేశ్ కు అప్పుడప్పుడూ దేవుడు కనిపించడం ఓ వింత. అది కూడా ఆయనకు కల్లో కనిపించి ప్రజామోదం ఉన్న నేత రానున్న కాలంలో నీవే అని చెప్పడం ఇంకా వింత.కృష్ణుడు కనిపించి రామ రాజ్య స్థాపన చేయమనడం ఇంకా వింత?ఇలా ఇన్ని వింత సముదాయం అఖిలేశ్ ఇరుక్కుపోవడం ఇంకా పెద్ద వింత. మనుషుల నమ్మకాలు ఎలా ఉన్నా నాయకుల నమ్మకా ల కారణంగానే ప్రజాస్వామ్య దేశాలలో ఆ పాటి అయినా మనం మనం అనుకుని పెంచి పోషిస్తున్న భావనలు ఇంకా ఇంకొన్ని బతుకీడుస్తున్నాయి. కనుక అఖిలేశ్ ఏం చెప్పినా బాగుంటుంది.
ఆయన ఏం చెప్పకపోయినా కూడా బాగుంటుంది. ఉత్తరాది ఎన్నికల్లో మతం ఒక్కటే కీ రోల్ కావొచ్చు.యాదవులకు ఆరాధనీ యుడు అయిన కృష్ణుడు మాట ప్రకారం ఈ సారి అఖిలేశ్ సీఎం అయితే,తప్పకుండా ఆయనకు దేవుడు కల్లో కనిపించాడు రా మ రాజ్యం స్థాపించమన్నాడనే ఒప్పుకుంటాం.కానీ సర్ ..దేవుడు మీరు చేసిన స్కాంల గురించి ఎప్పుడూ కనిపించి అడగ లేదా?అదే విధంగా మీ రౌడీయిజం గురించి మీ నాన్న అరాచకాల గురించి ఎప్పుడూ ప్రశ్నించలేదా సర్.. ఇన్నేళ్లు ఒంటిపైకి వచ్చినా ప్రధాని కావాలన్న ఆశ మీ నాన్నకు ఎందుకు పోవడం లేదు అని కూడా అడగలేదా సర్.. కుర్చీ కోసం చేసే దేవులాట లో భాగంగా దేవుళ్లను ఎందుకు సర్ తీసుకు వస్తారు అని కూడా అడగలేదా మిమ్మల్ని?
దేవుడెలా ఉంటాడో ఎవ్వరికీ తెలియక పోయినా పర్లేదు కానీ ఆయనకు మాత్రం దేవుడు ఎలా ఉంటాడు ఏ రూపంతో ఉంటాడు ఎలాంటి మాటలు చెబుతాడు ఎలాంటి రంగు ల్లో లోకాన్నిదర్శింపజేస్తాడు అన్నవి మాత్రం తెలుస్తాయి.ఆయనే ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. తనకు కృష్ణుడు కల్లో కనిపిస్తున్నాడని, వచ్చే కాలమంతా నీదేనని,నీవే రామ రాజ్య స్థాపన చేయాలని చెబుతున్నాడని, ఉత్తర ప్రదేశ్ లో యోగీ అన్ని విధాలా విఫలం అయ్యాడని చెబుతున్నాడని సంచలన ప్రకటన చేసి ట్రోలింగ్ కు గురి అవుతున్నారాయన. ఇంతకూ ఆయనకు,దేవుడకు మధ్య ఉన్న బంధం అంత బలమైందా?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి