మిత్రపక్షం బీజేపీ నేతల వేషాలను జేనసేన అధినేత పవన్ కల్యాణ్ గమనిస్తునే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్ల కోసం బీజేపీ వేసిన ప్లాన్ ఏమిటో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు పవన్. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలంటు బీజేపీ రాజ్యసభ ఎంపి జీవీఎల్ నరసింహారావు, బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చేస్తున్న గోలను పవన్ ఒక కంట గమనిస్తునే ఉన్నారు. ఎందుకంటే స్వయంగా పవన్ కూడా పెద కాపే కాబట్టి.





మొన్నటి ఎన్నికల్లో కాపుల ఓట్ల కోసం పవన్ గాలమేసినా అనుకున్నంత సక్సెస్ కాలేదు. కాకపోతే కాపుల్లోని ఓట్లు ఎంతో కొంత పడ్డాయి కాబట్టే 5 శాతం ఓట్లు వచ్చాయి. పవన్ కు పడిన ఓట్లలో కాపుల ఓట్లు అందులోను ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ. నిజానికి కాపుల ఓట్ల కోసం బీజేపీ మొదలుపెట్టిన ప్రయత్నాలు చాలా లేటైసోయింది. 2014లోనే చంద్రబాబునాయుడు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఫెయిలయ్యారు కూడా.





కాపులకు రిజర్వేషన్ అనే అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని అందరికీ తెలిసిందే. అందుకనే కాపులకు రిజర్వేషన్ అని ఎవరన్నా ఆ సామాజికవర్గం నమ్మేస్ధితిలో లేదు. కాబట్టి ఇపుడు బీజేపీ వేషాలను చూసి కాపులు నవ్వుకుంటున్నారు. ఇదే సమయంలో అందరిలో మొదలైన ప్రశ్న ఏమిటంటే మరిదే డిమాండ్ ను మిత్రపక్షమైన పవన్ ఎందుకు చేయటం లేదని ? కాపులకు రిజర్వేషన్ కల్పించే అవకాశం రాష్ట్ర పరిధిలోనే ఉంటే జగన్మోహన్ రెడ్డి కల్పించకుండానే ఉంటారా ? పోనీ పవన్ ఊరికే ఉండేవారా ?





మిత్రపక్షాల్లోనే కాపులకు రిజర్వేషన్ డిమాండ్ ను బీజేపీ ఎత్తుకున్నపుడు పవన్ మౌనంగా ఉండటంతోనే విషయం అందరికీ అర్ధమైపోతోంది. కాపులకు రిజర్వేషన్ అన్నది బీజేపీ ఎత్తుకున్న ఓట్ల నినాదమే అని కాపు నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. విచిత్రమేమిటంటే సోము వీర్రాజు కూడా కాపు సామాజికవర్గం నేతే కావటం. వీర్రాజు కూడా బాగా తెలుసు తమ డిమాండ్ అర్ధరహితమని. అయినా జగన్ కు అల్టిమేటమ్ ఇచ్చారంటేనే విచిత్రంగా ఉంది. ఏదేమైనా కాపు ప్రముఖుడైన పవన్ ఉండగా పవన్ తో సంబంధం లేకుండానే మిత్రపక్షం బీజేపీ కాపులకు రిజర్వేషన్ అంశం డిమాండ్ చేయటం ఆశ్చర్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: