జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్లాన్ మొత్తం రెడీగా పెట్టుకున్నట్లున్నారు. అదేమిటంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఎక్కిన పల్లకిని మోయాలని. చంద్రబాబును సీఎం చేయటమే జీవిత ధ్యేయంగా పెట్టుకునే పవన్ ప్లాన్ చేస్తున్నారు. అందుకనే 2024లో తాను ముఖ్యమంత్రి అవుతానని పవన్ స్పష్టంగా ప్రకటించటంలేదు. ఎంతసేపు వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానిచ్చేది లేదని, జగన్మోహన్ రెడ్డిని సీఎం కానిచ్చేది లేదనే చెబుతున్నారు.
ఒకవేళ పవన్ చెప్పినట్లే జరిగిందని అనుకుందాం. వైసీపీ అధికారంలోకి రాకపోతే అధికారంలోకి వచ్చేది ఎవరు ? ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేదెవరు ? అనే విషయంలో పవన్ క్లారిటి ఇవ్వాలి కదా. మరా విషయాలను ఎందుకని మాట్లాడటంలేదు ? అంటే తనకు బాగా తెలుసు తాను పనిచేస్తున్నదే చంద్రబాబును సీఎం చేయటం కోసమని. ఆ విషయం స్పష్టంగా చెప్పకుండా జనాలను పల్లకి ఎక్కిస్తానంటు సొల్లుకబుర్లకొటి.
పవన్ ఆలోచనలు ఒకలాగుంటే పార్టీలోని నేతల ఆలోచనలు మరోరకంగా ఉన్నాయి. తన ఆలోచనలకు పార్టీలోని నేతలు కొందరు భిన్నంగా మాట్లాడుతున్నారని స్వయంగా పవనే చెప్పుకున్నారు. పవన్ ఆలోచనలకు, నేతల ఆలోచనలకు తేడా ఎందుకొస్తోంది ? చంద్రబాబు ఎక్కిన పల్లకిని మోయటానికి తాము సిద్ధంగా లేమని కొందరు నేతలు ఇప్పటికే పవన్ కు డైరెక్టుగానే చెప్పినట్లు సమాచారం. అందుకనే అసలు టీడీపీతో పొత్తే వద్దని గట్టిగా వాదిస్తున్నారు.
ఈ విషయంలోనే కొందరు నేతలకు, పవన్ కు మధ్య భిన్నాభిప్రాయాలొస్తున్నాయి. పవన్ను సీఎం అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటిస్తే పొత్తులకు ఇబ్బంది లేదని కూడా నేతలు చెబుతున్నారు. దాన్నే పవన్ అంగీకరించటంలేదు. ఎందుకంటే తన ఆలోచనంతా తాను సీఎం కావటానికి కాదు, కేవలం చంద్రబాబును కుర్చీలో కూర్చోబెట్టడానికే అని అర్దమైపోతోంది. ఆ విషయాన్ని బహిరంగంగా అంగీకరించటానికే పవన్ భయపడుతున్నారు. ఇక్కడే పవన్ ఆలోచనలకు నేతల ఆలోచనల మధ్య తేడావస్తోంది. ఈ విషయం స్వయంగా పవనే అంగీకరించారు. మరి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి