ఏపీలో కొన్నిరోజులుగా వరుసగా అత్యాచారాల వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. రోజుకో చోట అత్యాచారం జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు వరుసగా జరిగినప్పుడు కొన్నిరోజుల పాటు అలాంటి వార్తలు బాగా ప్రాచుర్యం పొందుతుంటాయి. అయితే ఇప్పుడు ఈ రేపులపై టీడీపీ బాగా స్పందిస్తోంది. ఎక్కడికక్కడ బాధితులకు న్యాయం జరగాలంటూ ఆందోళనలు నిర్వహిస్తోంది. ప్రతిపక్షంగా టీడీపీ చేయాల్సిన పని అదే.


అయితే.. ఈ ఆందోళనలు చేసే ముందు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోవాలంటున్నారు కొందరు వైసీపీ నేతలు. టీడీపీ హయాంలో మహిళలపై అనేక దాడులు జరిగితే స్పందించని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అంటున్నారు. అప్పుడు లేవని చంద్రబాబు  గొంతు ఇప్పుడేందుకు లేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ప్రశ్నిస్తున్నారు.


విజయవాడలో మానసిన వికలాంగురాలుపై జరిగిన దాడిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం అందజేయడమే కాకుండా ఆ కుటుంబంలో వారికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు చేపట్టిందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గుర్తు చేశారు. అంతే కాదు..
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ను రూపొందించిందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అంటున్నారు.


దిశ యాప్‌ ఉంటే ప్రతి మహిళకు ఒక సెక్యూరిటీ గార్డు వెంట ఉన్నట్టేనని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గుర్తు చేశారు. తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి జరిగినప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలు ఎందుకు ఆ సంఘటనను ఖండించలేదని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఇప్పుడు అడుగుతున్నారు. గతంలో టీడీపీకి చెందిన వ్యక్తి వేధింపులకు బాలిక సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ధనలక్ష్మి విమర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: