మునుగోడు ఎంఎల్ఏ దెబ్బకు కాంగ్రెస్ హై కమాండే భయపడుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత పార్టీలో ఇదే చర్చ నడుస్తోంది. కొద్దిరోజులుగా కోమటిరెడ్డి రాగోపాల్ రెడ్డి వ్యవహారమే టాక్ ఆఫ్ ది పార్టీగా మారిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కు రాజీనామా చేయటం ఖాయం బీజేపీలోకి వెళ్ళిపోవటమూ ఖాయమనే. కాకపోతే ఆ ముహూర్తమే ఎప్పుడన్నది రాజగోపాల్ కు మాత్రమే తెలుసు.





సరే దింపుడుకళ్ళెం ఆశలాగ ఎంఎల్ఏ పార్టీమారకుండా చేయాల్సిన ప్రయత్నాలను అధిష్టానం చేస్తోంది. ఎంఎల్ఏ దగ్గరకు పార్టీ తరపున ప్రత్యేక దూతలుగా కొందరిని ఇప్పటికే పంపింది. సరిగ్గా ఇక్కడే ఎంఎల్ఏ వైఖరితో అధిష్టానం భయపడుతోందట. ఇంతకీ విషయం ఏమిటంటే తనను పార్టీ మారద్దని చెప్పటానికి వచ్చిన నేతలతో తనతో పాటు బీజేపీలోకి వచ్చేయమని రాజగోపాల్ బంపరాఫర్ ఇస్తున్నారట. కాంగ్రెస్ లో ఉండి పీకేదేమీ లేదు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా బీజేపీదే హవా అని చెబుతున్నట్లు సమాచారం.





తనతో పాటు కాంగ్రెస్ కు రాజీనామాలు చేసి బీజేపీలోకి చేరిపోయే ఉద్దేశ్యముంటే చెప్పాలని ఎదురు వచ్చినవాళ్ళనే అడుగుతున్నారట. బీజేపీలోకి రాదలచుకున్న వారు తనకు చెబితే మంచి పొజిషన్ విషయమై కమలనాదులతో మాట్లాడి అవసరమైన హామీలు తీసుకుంటానని కూడా చెబుతున్నారట. ఇంకొందరితో అవసరమైతే బీజేపీ పెద్దలతోనే డైరెక్టుగా మాట్లాడిస్తానని కూడా చెబుతున్నారట.





పార్టీ అధిష్టానం తరపున మాట్లాడటానికి రాజగోపాల్ దగ్గరకు వెళ్ళిన వాళ్ళకి సీన్ రివర్సులో కనబడుతుండటంతో ఏమిచేయాలో తోచక బయటకు వచ్చేస్తున్నారట. మొత్తానికి రాజగోపాల్ వ్యవహారం చూస్తుంటే రాజీనామా చేయటం, బీజేపీలో చేరిపోవటం, ఉపఎన్నికల్లో మళ్ళీ పోటీచేయటం ఖాయమనే అనిపిస్తోంది. ఎంతైనా బీజేపీతో రాజగోపాలరెడ్డిది ఆర్ధికబంధంకదా.  ఛత్తీస్ ఘర్లో వేల కోట్లరూపాయల బొగ్గుగనుల కాంట్రాక్టు తీసుకున్న తర్వాత ఇపుడు పార్టీమారనంటే కమలనాదులు ఒప్పుకుంటారా ? అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ఉపఎన్నికల్లో మళ్ళీ పోటీచేస్తే రాజగోపాల్ గెలుస్తారా ? అనేదే సందేహం. ఈ విషయంలో క్లారిటి కోసం కోమటిరెడ్డి వెయిట్ చేస్తున్నారంతే.





మరింత సమాచారం తెలుసుకోండి: