మనుషులు అన్నాక పొరపాటులు చెయ్యడం సహజం.. కొన్ని అత్యవసర పొరపాటులు కూడా చేస్తారు.చివరికి డబ్బుల విషయంలో కాస్త ఎక్కువగానే చేస్తారు. లావాదేవీల కోసం బ్యాంకుల వద్ద గంటపాటు క్యూలో నిలబడాల్సిన రోజులు పోయాయి. ఇప్పుడు యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్‌లు బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఇబ్బందులను చాలా వరకు తగ్గించాయి..


ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువ అయ్యాయి. బ్యాంకుల బాట పట్టేవారి సంఖ్య భారీగా తగ్గింది. అయితే, ఆన్‌లైన్ పేమెంట్స్‌కు పెరుగుతున్న ఆదరణతో పాటు, నష్టాలు కూడా పెరిగాయి. చాలా సార్లు నగదు బదిలీ చేసేటప్పుడు.. ఆ డబ్బు తప్పు ఖాతాలోకి బదిలీ అవుతుంటుంది. కొన్నిసార్లు మోసాలు కూడా జరుగుతాయి. అయితే, పొరపాటున వేరే ఖాతాలకు బదిలీ చేసిన డబ్బును తిరిగి పొందవచ్చు..అందుకు సింపుల్ టిప్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. మీ డబ్బును 48 గంటలలోపు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంటుంది. డబ్బును తిరిగి పొందడంలో బ్యాంక్ సహాయం చేయకపోతే, కస్టమర్ bankingombudsman.rbi.org.in లో ఫిర్యాదు చేయవచ్చు. పొరపాటున వేరే ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్లయితే, బ్యాంకు కు లేఖ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. అయితే, ఇందుకు కొంత ప్రాసెస్ ఉంటుంది. మీరు మీ ఖాతా నంబర్, ఖాతాదారు పేరు, డబ్బులు పంపిన నెంబర్, లావాదేవీ జరిపిన తేదీ, ఎంత మొత్తం డబ్బు ట్రాన్ఫర్ చేశారు. IFSC కోడ్, అనుకోకుండా లావాదేవీ జరిగిన ఖాతా నంబర్‌ను కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనాలి.. పొరపాటున ఎవరి ఖాతాలో డబ్బు బదిలీ చేయబడిందో, దానిని తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే, అతనిపై కూడా కేసు నమోదు చేయవచ్చు. అయితే, డబ్బు తిరిగి చెల్లించని సందర్భంలో ఈ హక్కు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది... ఇలా మీ డబ్బులను సులువుగా పొందవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: