ఢిల్లీలో మీడియాతో వైఎస్ షర్మిల  మాట్లాడుతు కడప ఎంపీ టికెట్ కోసమే తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందన్నారు. కేవలం ఈ ముక్కమాత్రమే చెప్పిన షర్మిల తన అభిప్రాయంపై వివరణ ఇవ్వటానికి పెద్దగా ఇష్టపడలేదు. ఇక్కడే ఆమె అభిప్రాయంపై అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. కడప ఎంపీ టికెట్ కోసమే హత్య జరిగింది వాస్తవమే అయితే పాత్రదారులెవరు ? సూత్రదారులెవరు అనేది కీలకం.





ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎంపీ టికెట్ కేటాయించాల్సింది జగన్మోహన్ రెడ్డి. జగన్ పై ఒత్తిడి తెచ్చి ఎవరు టికెట్ ఇప్పించుకోలేరన్నది వాస్తవం. ఒకవేళ చిన్నాన్నకు టికెట్ ఇవ్వటం ఇష్టంలేకపోతే అదే విషయాన్ని జగన్ చెబుతారే కానీ హత్యచేసే అవసరం ఏముంటుంది ? ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డిపైన చాలా ఆరోపణలున్నాయి. టికెట్ కోసం తనతో పాటు పోటీపడుతున్నారని వివేకాపై అవినాష్ కు కోపం ఉందనే అనుకుందాం.





టికెట్ కోసం పోటీపడినంతమాత్రాన వరసకు చిన్నాన్న అయ్యే వివేకానందరెడ్డిని అవినాష్ హత్య చేస్తారా ? అన్నది ప్రశ్న. ఎందుకంటే టికెట్ కోసం ఎంతమందైనా పోటీపడచ్చు. కానీ ఫైనల్ గా జగన్ ఎవరికి ఇవ్వాలని అనుకుంటే వాళ్ళే అభ్యర్ధవుతారు. సో వివేకాను హత్య చేయించినంతమాత్రాన అవినాష్ కు ఎంపీ టికెట్ దక్కుతుందనే గ్యారెంటీలేదు. ఈ విషయం అవినాష్ కు తెలీకుండానే ఉంటుందా ? టికెట్ కోసం తనతో పోటీకి వస్తున్నారని నేతలు  చంపుకోవటం మొదలుపెడితే చివరకు పోటీచేయటానికి ఎవరు మిగలరు.





కాబట్టి షర్మిల చెప్పినట్లుగా కేవలం ఎంపీ టికెట్ కోసమే బాబాయ్ హత్య జరిగింది అనేందుకు  అవకాశాలు తక్కువనే అనుకోవాలి. వివేకా హత్యకు బలమైన కారణాలు ఇంకేమైనా ఉండచ్చు. అన్నీ విషయాలు తెలిసిన వైఎస్ షర్మిల ఇంత అమాయకంగా కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా అభిప్రాయానికి వచ్చారో తెలీదు.  పోనీ చెప్పేదేదో మరింత వివరంగా చెప్పుంటే జనాలకు క్లారిటి వచ్చుండేది. అలా చెప్పకుండా కేవలం ఒక్కమాట మాత్రమే చెప్పి ఊరుకోవటంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: