దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉండాలని మోడీ ప్రభుత్వం జన్ ధన్ పథకాన్ని అమల్లొకి తీసుకొని వచ్చింది.దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద సుమారు 47 కోట్ల మంది ఖాతాలు తెరిచారు. అయితే కోట్లాది మందికి ఈ ఖాతాలో అందుబాటులో ఉన్న పథకాల గురించి తెలియదు. జన్ ధన్ ఖాతాదారులకు ప్రభుత్వం 10 వేల రూపాయలు అందజేస్తోంది. దీని కోసం మీరు బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఖాతాలో రూ.1 లక్ష 30 వేల బీమా వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీకు కూడా ఈ పథకాల గురించి తెలియకపోతే వెంటనే తెలుసుకొని 10 వేల రూపాయలకు దరఖాస్తు చేసుకోండి.


ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన లోన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఖాతాదారునికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మొదటి ప్రయోజనం ఏమిటంటే ఖాతాదారుడు ఈ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా రూపే డెబిట్ కార్డ్‌ను అందజేస్తారు. మీరు బ్యాంకులో దరఖాస్తు చేయడం ద్వారా ఈ ఖాతాలో రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఇది వరకు ఈ మొత్తం రూ.5 వేలు ఉండేది. దీనిని రూ.10వేలకు పెంచింది. అకౌంట్లో డబ్బులు లేకున్నా ఈ సదుపాయం పొందవచ్చు. దీని కోసం మీరు మీ బ్యాంకు శాఖను సంప్రదించాలి. కాగా, దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించినదే ఈ ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం. ఈ స్కీమ్‌ కింద అకౌంట్‌ ఓపెన్ చేసిన వారికి ఈ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా అందుతుంది.


బ్యాంకు ఖాతాలో ఎటువంటి డబ్బులు లేకున్నా కూడా డబ్బులను డ్రా చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఖాతాదారుడు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా నగదు విత్ డ్రా చేసినప్పుడు కొంత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రుణం రూపంలో జన్ ధన్ ఖాతాదారులు రూ.10వేల వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితి ఇంతకు ముందు రూ.5 వేల వరకు ఉండేది. కానీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది.ఖాతాదారులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. ఇందులో ఖాతాదారునికి లక్ష రూపాయల ప్రమాద బీమా ఇవ్వబడుతుంది. దీంతోపాటు 30 వేల రూపాయల జీవిత బీమా కూడా అందజేస్తారు. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే ఆ ఖాతాదారుడి కుటుంబానికి రూ.లక్ష బీమా కవరేజీని అందజేస్తారు..మీరు కూడా ఈ అకౌంట్ ను తెరవాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ను తీసుకొని దగ్గర లోని బ్యాంకుకు వెళ్ళి ఓపెన్ చెయ్యొచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: