పై ఫొటో తెగవైరల్ అవుతోంది. ఢిల్లీలో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో జరిగిన జీ20 దేశాల సమావేశానికి సన్నాహక మీటింగ్ జరిగింది. ఈ మీటింగుకు అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్షాల నేతలను కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సమావేశం టీ బ్రేక్ లో మోడీ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరిని పేరుపేరునా పలకరించారు. ఈ  సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడును కూడా మోడీ పలకరించారు.

దీనికి సంబంధించిన ఫొటోనే ఇది. ఇపుడు ఈ ఫొటో ఎందుకు వైరల్ అయ్యిందంటే అందుకు కారణం మాత్రం ఎల్లోమీడియా పైత్యమనే చెప్పాలి. జగన్ను  కలిసినపుడు మోడీ కాస్త కటువుగా మాట్లాడారని ఎల్లోమీడియా చెప్పింది. ఇదే చంద్రబాబును కలిసినపుడు మాత్రం మోడీ చాలా ఉత్సాహంగా మాట్లాడారట. బాగా సన్నిబడిపోయారని, పర్యటనలు చేస్తున్న విషయం తనకు తెలుసనని చెప్పారట. చంద్రబాబు ఆరోగ్యాన్ని వాకాబుచేయటంతో పాటు కుటుంబం క్షేమాన్ని కూడా ప్రస్తావించారట.

ఇదంతా ఎల్లోమీడియా పైత్యమనే చెప్పాలి. మోడీ-జగన్ మధ్య జరిగిన సంభాషణ ఎల్లోమీడియాకు ఎలా చేరింది. చెబితే మోడీ లేదా జగన్ చెప్పాలి. ఇద్దరు నోరుకూడా విప్పరు. కాబట్టి తెలిసే అవకాశంలేదు. అంటే వీళ్ళ మధ్య సంభాషణను ఎల్లోమీడియా తనకు తాను ఊహించేసుకుని కతలు అల్లేసింది. ఇక మోడీ-చంద్రబాబు మధ్య మాటలంటారా దాన్ని చంద్రబాబు చెప్పే అవకాశముంది. సరే చంద్రబాబు చెప్పినా చెప్పకపోయినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి అనుకూలంగానే అల్లేయటం మామూలేకదా.

అయితే నానా అవస్తలుపడి ఎల్లోమీడియా కతలు అల్లేసిన తర్వాత పై ఫొటో బయటపడింది. ఈ ఫొటోలో జగన్ రెండుచేతుల మధ్య మోడీ చేయుంది. జగన్ నవ్వుతు ఏదో చెబుతుంటే మోడీ ఆసక్తిగా వింటున్నట్లుంది. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఫొటోలో చంద్రబాబు నమస్కారం చేస్తుంటే మోడీ మాత్రం ఎటో చూస్తున్నట్లు కనబడుతోంది.  పై ఫొటోల ద్వారా జగన్, చంద్రబాబు విషయంలో మోడీ వ్యవహరించిన విధానం అందరికీ అర్ధమైపోతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎల్లోమీడియా కష్టపడి అల్లని కతంతా ఒక్క ఫొటో దెబ్బకు గాలిలో కొట్టుకుపోయినట్లయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: