రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు కాపులతో తలనొప్పి తప్పేట్లులేదు. ఒకందుకు  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. అయితే మరోకందుకు పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఆట ఇద్దరు ఆటగాళ్ళమధ్యే అంటే చంద్రబాబు-పవన్ మద్యే అయితే ఎలాగుండేదో తెలీదు. కానీ  మధ్యలో చాలామంది దూరేయటంతో ఆటమొత్తం కలగా పులగమైపోతోంది. ఇక ఇపుడు ఎలా ఆడాలన్న ప్లాన్ చంద్రబాబు, పవన్ చేతిలో లేకుండా పోయింది.

చంద్రబాబు-పవన్ మధ్య పొత్తులోకి సంబంధంలేకుండానే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, కాపు సంక్షేమసేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య దూరిపోయారు. పవన్ను సీఎం అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటిస్తేనే కాపుల ఓట్లు పడతాయని ఉండవల్లి చెప్పారు. జనసేన మద్దతు కారణంగా కాపుల ఓట్లు పడాలంటే పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించటం తప్ప చంద్రబాబుకు వేరే దారిలేదని ఉండవల్లి చెప్పటంతో ఒక్కసారిగా కాపుల్లో గోల మొదలైపోయింది.
ఉండవల్లి అలా చెప్పారో లేదో వెంటనే జోగయ్య అందుకున్నారు. పవన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తేనే టీడీపీ-జనసేనకు కాపుల ఓట్లు పడతాయని కండీషన్ పెట్టేశారు. అంటే రెండుపార్టీలు పొత్తు పెట్టుకున్నా పవన్ గనుక సీఎం అభ్యర్ధి కాకపోతే కాపుల ఓట్లు పడవు అని జోగయ్య స్పష్టంగా చెప్పినట్లే. ఉండవల్లి, జోగయ్య ప్రకటనలతో కాపుల్లో చర్చ మొదలైపోయింది. పవన్ను సీఎం అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించాల్సిందే అనే డిమాండ్ ఊఫందుకుంటోంది. అయితే కొండగట్టు, మంగళగి పార్టీ ఆఫీసులో పవన్ చేసిన ప్రకటనతో అంతా అయోమయం మొదలైంది.

ఇలాంటి ట్విస్టును చంద్రబాబు ఊహించినట్లు లేరు. అసలు చంద్రబాబు తాపత్రయమంతా ముందు తాను సీఎం అయి తర్వాత లోకేష్ ను సీఎం చేయటానికే కానీ పవన్ను సీఎం చేయటం కోసంకాదు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇలాంటి నేపధ్యంలోనే పవన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించటమంటే చంద్రబాబుకు పెద్ద తలనొప్పనే చెప్పాలి. పవన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించకపోతే కాపుల ఓట్లు పడవు. అలాగని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే పార్టీలోని నేతలు, కార్యకర్తలు+కమ్మ ప్రముఖులు ఎలా స్పందిస్తారో తెలీదు. చంద్రబాబు కష్టమంతా  పవన్ను సీఎం చేయటానికైతే కాదు. మరిపుడు కొత్త ట్విస్టును  చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: