
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ అధికారంలోకి వస్తే చేయబోయే ఆరు హామీలను ప్రకటించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల తెలంగాణ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డిలో ఆందోల్ నియోజకవర్గం సెంటిమెంట్ ఆధారంగానే ప్రస్తుతం ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయని.. గత సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయిందంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్నారు.
ఇంతకీ గత సెంటిమెంట్ ఏంటో తెలుసా.. సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం లో ఏ పార్టీ నుంచి అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో ఇక అదే పార్టీ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే ఒక సెంటిమెంట్ ఉంది. అయితే ఇక ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఇది నిజమైంది. ఆందోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా బిఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఓడిపోయారు. దీంతో ఆందోల్ లోకి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారాన్ని దక్కించుకుంది. 1984 ఎన్నికల నుంచి కూడా ఇక్కడ ఇదే సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది అని చెప్పాలి.