మూడుపార్టీల కూటమి మొదటి బహిరంగసభలోనే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు  నరేంద్రమోడీ పెద్ద షాకే ఇచ్చినట్లున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. తాము మాత్రమే పొత్తుపెట్టుకుంటే సరిపోదని బతిమలాడుకుని, చివాట్లు తిని ఎలాగో ఒకలాగ బీజేపీని కూడా పొత్తులోకి వచ్చేట్లు చేశారు. మూడుపార్టీల కూటమి ఆధ్వర్యంలో మొదటి బహిరంగసభ ప్రజాగళం చిలకలూరిపేటలో జరిగింది. చిలకలూరిపేటలో  టీడీపీకి మంచిపట్టుందనే చెప్పాలి. అలాంటి నియోజకవర్గంలో పెట్టిన బహిరంగసభకు జనాలు అంతంత మాత్రంగానే వచ్చారు.





బహిరంగసభ, జనసమీకరణ విషయాలను పక్కనపెట్టేస్తే సభలో మాట్లాడిన పవన్, చంద్రబాబు ఎప్పుడూ బురదచల్లేసినట్లే జగన్మోహన్ రెడ్డిపైన నోటికొచ్చిట్లుగా చల్లేశారు. తాము బురదచల్లటమే కాకుండా మోడీతో కూడా చల్లించాలని ప్రయత్నించారు. అయితే మోడీ మాత్రం అదేమి పట్టించుకోలేదు. జగన్ను పేరుపెట్టి ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడలేదు. వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారంతే.  వైసీపీ, కాంగ్రెస్ ఒకే ఒరలోని కత్తులన్నారు. ఏపీకి కేంద్రం మంజూరుచేసిన విద్యాసంస్ధల జాబితాను మోడీ వివరించారు.





బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామనే విషయంలో తమ్ముళ్ళకి చంద్రబాబు పెద్ద వివరణే ఇచ్చుకున్నారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విశాఖస్టీల్ ప్రైవేటీకరణను ఆపటం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, మౌళిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర సహకారం అవసరం కాబట్టి మళ్ళీ ఎన్డీయేలో చేరినట్లు చెప్పుకున్నారు. అయితే తాజా బహిరంగసభలో పై అంశాలను పవన్, చంద్రబాబు పొరబాటున కూడా ప్రస్తావించలేదు. కాబట్టి మోడీ కూడా ఆ ఊసే ఎత్తలేదు. పైగా ఎన్డీయేకి ఎందుకు ఓట్లేయాలో ముగ్గురూ చెప్పలేదు.





తాము జగన్ పైన ఆరోపణలు చేసినట్లే మోడీ కూడా చేయాలని పవన్, చంద్రబాబు ఆశించారు. అయితే అది జరగలేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మీద మోడి అవినీతి ఆరోపణలు చేసినట్లుగా ఇపుడు జగన్ గురించి ఏమీ మాట్లాడలేదు. దాంతో వీళ్ళిద్దరు బాగా నిరాసకు గురైనట్లే కనిపించింది. జగన్ పైన పవన్, చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకత మోడీకి ఎందుకుంటుంది ?  అందుకనే జగన్ పైన వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు చేయకుండానే మోడీ తన స్పీచును ముగించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: