ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది అధికార పార్టీ లాగే ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో ఒక కొత్త అంశం తెరమీదికి తీసుకువచ్చారు అక్కడి అభ్యర్థులు.ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.గెలుపే లక్ష్యంగా  నువ్వా-నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్న వారి తీరును చూస్తుంటే అక్కడి ప్రజలకి కునుకు కరువైనట్లుంది.దీంతో పల్నాడులోని గురజాల నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. అక్కడ టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మరోసారి పోటీకి బరిలో దిగారు.

ఇక్కడ ఇద్దరికి బలాబలాలు బాగానే ఉన్నాయి. సామాజికవర్గం, ఆర్థికం, ప్రజల్లో దూకుడు వంటి విషయాల్లో ఇరువురు నాయకులు కూడా ఏమాత్రం తీసిపోన్నట్లుగా ఉన్నారు. సమ ఉజ్జీలుగా ముందుకు సాగుతున్నారు అని చెప్పవచ్చు.దీంతో రాష్ట్రంలో చాలా నియోజక వర్గాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మంచి టఫ్ ఫైట్ సాగుతోంది అనడంలో ఆశ్చర్యం లేదు.దీంతో ప్రస్తుతం ఇద్దరు నాయకులు కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త విధానాన్ని మేనిఫెస్టో రూపంలో తీసుకువచ్చారు.సాధారణంగా అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలను రూపొందిస్తాయి.ఇలాంటి మ్యానిఫెస్టోలు ప్రస్తుతపు ఎన్నికల్లో ఎంతోకొంత ఎఫెక్ట్ ప్రజలను గురించేస్తున్నాయి.

అయితే అదే విధంగా ఇక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా గురజాలలో సంప్రదాయానికి భిన్నంగా వైసీపీ అభ్యర్థి కాసు, టీడీపీ అభ్యర్థి యరపతినేనిలు స్వయంగా ఎవరికివారు మేనిఫెస్టోలు ప్రకటించుకున్నారు. తమను గెలిపిస్తే ఈ పనులు చేస్తాం ఆ పనులు చేస్తాం అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో  ఉన్నారు. దీంతో  వారిద్దరి రాజకీయాలకు ఈ మేనిఫెస్టో రాజకీయం కూడా తోడైంది. దాంతో ప్రజలు ఎవరి మ్యానిఫెస్టో వైపు మొగ్గు చూపుతారనేది చాలా ఆసక్తిగా మారింది.

యరపతినేని  ప్రకారం  మేనిఫెస్టో

1) ఏడాదికి ఒక ఉచిత వంట గ్యాస్ సిలిండర్‌

2) హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం

 3) వేళంగిణీ మాత దర్శనానికి వెళ్లే క్రిస్టియన్లకు బస్సుల ఏర్పాటు

 4)యువతకు ఉపాధి

కాసు మహేష్‌రెడ్డి  ప్రకారం  మేనిఫెస్టో

1) ఇంటింటికీ తాగునీటి కుళాయి

 2) రహదారుల విస్తరణ

3) స్థలం ఉండి కూడాఇల్లు కట్టుకోలేక పోయిన వారికి రూ.2 లక్షలు ఆర్తిక సాయం

4)  రూ.7 కోట్ల వ్యయంతో నూతన చర్చిల నిర్మాణం

అయితే వారి గెలుపుకి ఈ రకమైన ప్రచారం అనేది ఎవరిని విజయం వైపుకి తీసుకుపోతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: