ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి వేడెక్కాయి. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయింది. కొన్ని పార్టీల అభ్యర్థులు అయితే ఇప్పటికే ప్రచార రంగంలో దూసుకు పోతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎలక్షన్స్ లో  మెజారిటీ స్థానాలలో విజయం సాధించాలనుకుంటుంది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతి పక్షంతో సరిపెట్టుకున్న బిఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటుంది.


 కాగా ప్రస్తుతం డిఆర్ఎస్ పార్టీ లోని కీలక నేతలందరినీ కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటూ గులాబీ దళపతి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి వరుసగా షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయం లో అటు బిఆర్ఎస్ నేతలు అందరూ కూడా రేవంత్ ను టార్గెట్ చేస్తూ ఒకే విషయం తెర మీదకి తెస్తూ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. అదే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా కొనసాగుతున్న రేవంత్ బిజెపి లోకి వెళ్ళబోతున్నాడని. అదేంటి కాంగ్రెస్ నుంచి సీఎం కుర్చీలో ఉన్నాక.. ఇక రేవంత్ బిజెపిలోకి వెళ్లాల్సిన అవసరమేముంది అనే ప్రశ్న చాలా తెలంగాణ ప్రజల్లో ఉంది.


 కాగా బిఆర్ఎస్ ఇలా రేవంత్ ని ఉద్దేశిస్తూ ఎందుకు విమర్శలు చేస్తుంది అనే విషయం పై ఆ పార్టీ కీలక నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బిజెపిలో చేరుతారని ఆరోపణలపై సీఎం ఎందుకు స్పందించడం లేదు అంటూ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో కేంద్రం విచారణ చేయొచ్చని రేవంత్ భయపడుతున్నారు. సికింద్రాబాద్, కరీంనగర్, నిజాంబాద్, చేవెళ్ల, అదిలాబాద్, లాంటి స్థానాలలో బిజెపి అభ్యర్థులు గెలిచేలా రేవంత్ చర్యలు కనిపిస్తున్నాయ్. ఎలాగో బిజెపిలో చేరుతాను కాబట్టి నలుగురు బిజెపి ఎంపీలను గెలిపించుకుందామని రేవంత్ అనుకుంటున్నారు అంటూ విమర్శించారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: