గత అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు కూడా మరోసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే గత అసెంబ్లీ గెలిచి మరోసారి అధికారాన్ని దక్కించుకొని హ్యాటరీ కొడతామని భావించిన బిఆర్ఎస్ పార్టీకి బంగపాటు ఎదురయింది  తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు నిలవడంతో చివరికి బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదా తోనే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ కనీసం ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో అయిన మెజారిటీ స్థానాలలో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. ఇక ఓటరు మహాశయులను  ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే గులాబీ దళపతి కేసీఆర్ అటు కేవలం బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొంటూ ఉన్నప్పటికీ.. ఇక ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం ఎప్పటికప్పుడు కార్యకర్తలు పార్టీ నేతలతో మమేకమవుతూ ఇక దిశా నిర్దేశం చేస్తూ ఉన్నారు.


కాగా ఇన్నాళ్లు కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అంటూ విమర్శించిన కేటీఆర్ మొదటి సారి తమ ప్రభుత్వం చేసిన తప్పులను అంగీకరించారు. రాష్ట్ర రాజకీయాలు మరో దశాబ్దం పాటు కేసీఆర్ చుట్టూ తిరుగుతాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 20 ఏళ్ళుగా కేసీఆర్ చుట్టూనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను నడిచాయి. మా ప్రభుత్వంలో తెలంగాణను నెంబర్వన్ గా నిలబెట్టాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేశాం. రైతుబంధు, దళిత బంధు, కార్యకర్తల విషయంలో చేసిన పొరపాట్లను గుర్తించలేకపోయాం. కానీ తప్పులను సరిదిద్దుకుంటాం. స్వల్ప తేడాతోనే ఓడిపోయాం. కానీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విజయం సాధిస్తాం అంటూ కేటీఆర్ ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: