ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రజలు ఏ వైపు సపోర్ట్ చేస్తున్నారు అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ప్రతి నియోజకవర్గంలో ఓవైపు వైసీపీ మరోవైపు టిడిపి గట్టి ఫైట్ చేయబోతున్నాయి. ఏ అభ్యర్థి గెలిచిన అంత మెజారిటీ ఏమీ రాదు. ఎవరికైనా కొద్దిపాటిలో గెలుపు అనేది ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా. అలాంటి గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారిపోయింది. నియోజకవర్గంలో టిడిపి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అన్నబత్తిని శివకుమార్ పోటీ చేస్తున్నారు.

 బలబలాలు :
 ఇక వైసిపి నుంచి పోటీ చేసేటువంటి అన్నబత్తుని శివకుమార్ ఇప్పటికే రెండుసార్లు ఆయన గెలిచి  మూడోసారి బరిలో ఉన్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో  పోటీ మాత్రం  చాలా టైట్ గా ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే శివకుమార్ వైసీపీ చేసినటువంటి  అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా నేను గెలిస్తే మీతోనే లోకంలో ఉంటానని,  ప్రజలకు బలంగా వినిపిస్తున్నారు. టిడిపి, జనసేన, బిజెపి  పొత్తుల వైఫల్యాలను వివరిస్తూ  తనకు ఓటు వేయాలని ప్రార్థిస్తున్నారు. ఇదే తరుణంలో ఐదవ సారి పోటీ చేస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్  వైసిపి హయాంలో  అభివృద్ధి ఏమి జరగలేదని,  తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేసిన  అభివృద్ధి తప్ప మరేమీ కనబడడం లేదని అంటున్నారు.  అంతేకాకుండా తాను గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉందని ఒక టాక్ జనాల్లోకి వదిలిపెట్టారు. ఈ విధంగా ఒకరికొకరు  విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ  ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడ్డారు.

 అలపాటి ఏ వైపు:
 ఇక తెనాలి టిడిపి ఇన్చార్జిగా ఉన్నటువంటి మాజీమంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ తనికె టికెట్ వస్తుందని భావించారు. కానీ పొత్తులో భాగంగా  నాదెండ్లకు టికెట్టు కేటాయించడంతో  ఆయన సపోర్టు ఏ మేరకు ఉంటుందనిది ఆసక్తికరంగా మారింది. పైకి నవ్వులు కడుపులో కత్తులు పెట్టుకొని ఉంటున్నారని టాక్ కూడా నియోజకవర్గం అంతా వ్యాపించింది  ఒకవేళ అలపాటి అలక భూనితే మాత్రం టిడిపి అభ్యర్థి గెలుపు కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: