ఇండియా హెరాల్డ్:  ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తిగా మారాయి. ఇక తెలంగాణ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోబూచులాట జరుగుతోంది. 4 సీట్లతో మొదలైన బీజేపీ ఈరోజు 7 సీట్లకు చేరుకుంది. 4 సిట్టింగ్ స్థానాలతో పాటు చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకోనుంది. పైగా వరంగల్, జహీరాబాద్, మహబూబ్ నగర్ స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బిఆర్ఎస్ కేవలం మెదక్ లో అది కూడా గట్టి పోటీ మధ్య మాత్రమే  నిలుపుకోనుంది.కాంగ్రెస్‌కు 10 సీట్లు రావడం కష్టంగానే కనిపిస్తుంది. చివరకు భువనగిరి, వరంగల్ స్థానాల్లో కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వస్తే.. పది రోజుల క్రితం ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ అద్బుతమైన పునరాగమనం చేయగా, ఇప్పుడు మళ్లీ కూటమి అంచుకు వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ గ్రాఫ్ రికవరీ అయ్యి పుంజుకుంన్నట్టు వున్నా అది వాపుగానే కనిపిస్తుంది తప్పా బలుపుగా మారని పరిస్థితి కనిపిస్తుంది. సీమతో పాటు విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ముందంజలో ఉంది. విశాఖ సిటీలో మాత్రం గతంతో పోలిస్తే కొంచెం బలంగానే ఉంది కానీ ఆ బలం పార్టీని అధికారంలోకి తీసుకు వస్తుందన్నది మాత్రం చెప్పలేం. ఇప్పటి దాకా ఉన్న లెక్కల ప్రకారం చూస్తే మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో ఓవరాల్ గా కూటమిదే పైచేయి అని ఇండియా హెరాల్డ్ సర్వే ద్వారా తెలుస్తోంది.
రాబోయే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో టీడీపీ కూటమి బాగా సత్తా చాటుతుంది. పది రోజుల క్రితం పొత్తులో కొన్ని అసంతృప్తుల్లో భాగంగా కూటమి జోరు తగ్గినా కానీ తర్వాత కాస్త పర్వాలేదు అనిపించుకొని ఇప్పుడు బాగా పుంజుకునేలా కనిపిస్తోంది. సర్వే ప్రకారం ప్రస్తుతానికి తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి అయితే అధికారానికి చేరువైంది. ఇక వైసీపీ అయితే 60 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దాదాపు 30 నియోజకవర్గాల్లో పోటీ జరుగుతోంది. అయితే ఈ నియోజకవర్గాల ఓటర్ల తీర్పును బట్టి గెలుపు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. https://epaper.indiaherald.com/3858962/India-Herald-Group-of-Publishers-P-LIMITED/Indiaherald-25th-April-2024

మరింత సమాచారం తెలుసుకోండి: