ఇండియా హెరాల్డ్.కామ్ ప్ర‌చారామారామా శీర్షిక‌లో ఖ‌చ్చితంగా చెప్పుకోవాల్సిన ఏపీ పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌లో గుంటూరు ప‌శ్చిమం నుంచి పోటీ చేస్తోన్న మ‌హిళా మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ ఖ‌చ్చితంగా ఉంటారు. ర‌జ‌నీ అంటే 2019 ఎన్నిక‌ల్లో ఓ సంచ‌ల‌నం.. అస‌లు ఆమె ప్ర‌చారం చేస్తోన్న తీరు.. ఆమె మాట‌ల తూటాలు ఓ రేంజ్‌లో పేలిపోయేవి. చిల‌క‌లూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు మారాక కూడా ఇప్పుడు ఆమె అదే వాగ్దాటితో టీడీపీ కంచుకోట‌లో దూసుకుపోతున్నారు.

స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే గుర్తించ‌డం.. ప‌రిష్క‌రించ‌డంతో పాటు ఈ ఎన్నిక‌ల్లో ఆమె త‌న‌దైన వాగ్దాటితో త‌న‌ను గెలిపిస్తే ఆ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తున్నానో చెపుతోన్న తీరు ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటోంది. విడ‌ద‌ల ర‌జ‌నీ ప్ర‌సంగాలు అంటే క్లాస్ టు మాస్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రికి చాలా సింపుల్‌గా క‌నెక్ట్ అవుతున్నాయి. ఇక సోష‌ల్ మీడియాలో ఆమె దుమ్ము దులిపేస్తూ ఉంటారు. ఏపీ రాజ‌కీయాల్లో ఎంతో మంది ఉన్నా విడ‌ద‌ల ర‌జ‌నీ ఓ సోష‌ల్ మీడియా స్టార్ అనే చెప్పాలి.


ర‌జ‌నీ ఒక మాట మాట్లాడితే అది ఎంతోమందిపై ప్ర‌భావం చూపిస్తోంది. ఎంతోమందిలోకి అది చొచ్చుకుపోతూ ఉంటుంది. ఇక చిల‌క‌లూరిపేట‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ సీటుగా ఉండే కీల‌క‌మైన గుంటూరు న‌గ‌రం నుంచి పోటీ చేస్తోన్న ఆమె ఎన్నో సంక్లిష్ట ప‌రిస్థితులు దాటుకుని గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం దిశ‌గా వెళుతున్నట్టే వాతావ‌ర‌ణం ఉంది. ఇది రాజ‌ధాని ప్రాంతం.. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ మార్పు ప్ర‌జ‌ల్లో ఉంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.


పైగా ఇక్క‌డ నుంచే టీడీపీ త‌ర‌పున దేశంలోనే ధ‌న‌వంతులు అయిన ఎంపీ అభ్య‌ర్థుల్లో ఒక‌రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ పోటీలో ఉన్నారు. ఇదే పార్ల‌మెంటులో టీడీపీ కీల‌క నేత నారా లోకేష్‌తో పాటు అటు మ‌రో కీల‌క టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర‌, ఇటు జ‌న‌సేన టాప్ 2 లీడ‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ లాంటి వాళ్లు పోటీలో ఉన్నారు. వెస్ట్‌లో జ‌న‌సేన ప్ర‌భావమూ ఎక్కువే. అటు టీడీపీ నుంచి కూడా బీసీ మ‌హిళే పోటీలో ఉన్నారు.


ఇలా ఎన్ని ప్ర‌తికూల‌త‌లు ఉన్నా.. గుంటూరు వెస్ట్ స‌మీక‌ర‌ణ‌లు ఎంత సంక్లిష్టంగా ఉన్నా కూడా ర‌జ‌నీ త‌న చాతుర్యం, త‌న మాట తీరుతో ఆమె సీన్ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటోన్న వైనం ఇప్పుడు అందరిని క‌ట్టి పడేస్తోంది. మ‌రి వైసీపీలో టాప్ ఫైర్ బ్రాండ్ లీడ‌ర్లలో ఒక‌రు అయిన ర‌జ‌నీ గ‌త ఎన్నిక‌ల్లో చేసిన మ్యాజిక్ ఎంత వ‌ర‌కు రిపీట్ చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: