ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మోడీకి సంబంధించిన జాతకం గురించి జ్యోతిష్యులు చెప్పడంతో ఇది కాస్త మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకీ మోడీ జాతకం ఎలా ఉంది..జ్యోతిష్యులు ఏమని చెబుతున్నారు అనేది ఇప్పుడు చెప్పు చూద్దాం.. పహల్ గామ్ అటాక్ తర్వాత అటు భారత్ ఇటు పాక్ రెండు దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ ప్రతిసారి కాల్పుల ఉల్లంఘనను బ్రేక్ చేస్తూ ఇండియన్ ఆర్మీ పై కాల్పులు జరుపుతుంది.దీనికి ధీటుగా ఇండియన్ ఆర్మీ కూడా బదిలిస్తుంది. అలాగే ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీ కూడా పలు మిస్సైల్ లను ఇండియాలోని కొన్ని ప్రశ్నలు టార్గెట్ గా చేసుకొని వదులుతున్నప్పటికీ ఇండియన్ ఆర్మీ దాన్ని చిత్తుచిత్తు చేస్తుంది. ఇప్పటికే భారత్ లోకి దూసుకొచ్చిన యుద్ధ విమానాలన్నింటిని కూల్చివేసింది. 

ఇక భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ జాతకం గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెడుతున్నారు జ్యోతిష్యులు. ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా పాక్ భారత్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉజ్జయిని జ్యోతిష్యుడు అయినటువంటి నళిన్ శర్మ సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగే యుద్ధం శుక్ర,శని,రాహు గ్రహాల కలయికలో స్టార్ట్ అయింది. గ్రహాల ప్రకారం చూస్తే.. శుక్రుడు తన ఉచ్ఛరాశి అయినటువంటి మీనంలో శని,రాహువులతో ఉన్నాడు కాబట్టి పాక్ ఇండియా యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగదు. భారత్ కి త్వరలోనే పాకిస్తాన్ లొంగిపోతుంది. ఒకవేళ లొంగిపోకపోతే ఆ పరిస్థితులు మరోలా ఉంటాయి.

 అంతేకాదు పాకిస్తాన్ కి తీవ్ర నష్టం తప్పదు.POK కూడా భారత్లో విలీనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాల ప్రభావం వల్ల భారత్ పరాక్రమం పెరుగుతుంది.మోడీ జాతకం చూసుకుంటే.. మోడీ జాతకంలో పంచమ భాగంలో రాహువు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అనుకున్నది సాధిస్తాడని తెలుస్తోంది. ఈ యుద్ధం కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నరేంద్ర మోడీ అనుకున్నది సాధిస్తాడు.. అంటూ సంచలన విషయాలు చెప్పారు ఉజ్జయిని జ్యోతిష్యుడు నళిన్ శర్మ.ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: