టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఈ వయసులోనూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే నాగార్జున ఇద్ద‌రు వారసులు నాగచైతన్య - అఖిల్ కూడా టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం నాగార్జున వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సక్సెస్ లేదు. నాగార్జున నటించిన సినిమాలన్నీ వరుస పెట్టి డిజాస్టర్లు అవుతున్నాయి. ఇక నాగార్జున సినిమాలుకు గుడ్ బై చెప్పేసి రాజకీయాలకు వచ్చేందుకు అడుగులు పడుతున్నాయా ? ఆయనను ఆదిశగా ప్రోత్సహిస్తున్నారా ? అంటే అవును అన్న చర్చలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఇప్పటికే వ్యాపారాలలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. ఇక ఆయనకు మిగిలి ఉన్న ఆప్షన్ రాజకీయాలు .. ఈ వయసులో రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి రాణించాలన్న తపన నాగార్జునకు ఉందో లేదో కానీ ఆయనకు కొన్ని పొలిటికల్ పార్టీల నుంచి బంపర్ ఆఫర్లు వెళుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందే జగన్ నాగార్జునకు వైసీపీ నుంచి విజయవాడ లోక్‌స‌భ స్థానాన్ని ఆఫర్ చేసినట్టు ప్రచారం జరిగింది.


అప్పట్లో నాగార్జున - జగన్ మధ్య కొన్ని రాయబారాలు కూడా నడిచాయని అంటారు .. నాగార్జున కూడా తెలుగుదేశానికి దూరంగా వైసీపీ అధినేత జగన్ మనసుకు దగ్గరగా ఉంటారన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని వైసిపి ఒక్కసారి కూడా గెలుచుకోలేదు.. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయవాడ లోక్సభ సీటుపై వైసీపీ జెండా ఎగరవేయలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు నాగార్జునను విజయవాడ నుంచి లోక్సభకు పోయి పోటీ చేయించే ప్రతిపాదన మరోసారి వైసీపీ క్లోజ్ సర్కిల్స్ మధ్య డిస్కషన్ పాయింట్ గా మారినట్టు తెలుస్తోంది. మరి జగన్ ఈ ప్రతిపాదన తెర మీదకు తీస్తే ఈసారి అయినా నాగార్జున అందుకు ఒప్పుకుంటాడా ? సినిమాలలో ఎలాగూ పెద్దగా సక్సెస్ లేదు .. ఈ టైంలో రిస్క్ చేసి పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: