- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) :

ఏపీ, తెలంగాణ‌లో గ‌త రెండు ద‌శాబ్దాల్లో చాలా విద్యాసంస్థ‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడిముబ్బ‌డిగా బ్రాంచ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. రెండు ద‌శాబ్దాల క్రితం ఒక‌టి రెండు సంస్థ‌లదే హైస్కూల్‌, ఇంట‌ర్ విద్య‌తో పాటు ఎంసెట్‌లో అగ్ర‌భాగం. ఆ త‌ర్వాత చాలా సంస్థ‌లు ఈ రెండు సంస్థ‌ల‌కు పోటీగా వ‌చ్చాయి. కొన్ని సంస్థ‌లు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే గ‌త ద‌శాబ్ద‌కాలంలో ఏపీ, తెలంగాణ విద్యారంగంలో విర‌బూస్తూ  విద్యా కుసుమంలా విస్త‌రిస్తోన్న సంస్థ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం తిరుమ‌ల విద్యాసంస్థ‌. ప‌దేళ్ల వ్య‌వ‌ధిలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగంలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకోవ‌డం అంటే అసామాన్య విష‌యం. ఇదంతా తిరుమ‌ల విద్యాసంస్థ‌ల అధినేత నున్నా తిరుమ‌ల‌రావు ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌, కృషి వ‌ల్లే సాధ్య‌మైంద‌ని చెప్పాలి.


2011లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌మీపాన కాతేరు అనే చిన్న ప‌ల్లెటూర్లో కేవ‌లం 400 మంది విద్యార్థుల‌తో ప్రారంభ‌మైన తిరుమ‌ల విద్యాసంస్థ‌లు నేడు అటు ఉత్త‌రాంధ్ర‌తో పాటు ఇటు గోదావ‌రి జిల్లాల‌కు విస్త‌రిస్తూ 35 వేల మంది విద్యార్థుల‌తో అప్ర‌తిహ‌తంగా దూసుకు పోతున్నాయి. మ‌రీ ముఖ్యంగా గ‌త మూడు నాలుగేళ్ల‌లో తిరుమ‌ల విద్యాసంస్థ‌ల విజ‌యాలు ఏపీ, తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థ‌ల ఫ‌లితాల్లో త‌ల‌మానికంగా మారాయి. గ‌త యేడాది త‌ణుకు, పాయ‌కారావుపేట బ్రాంచ్ ఏర్పాటు కాగా.. ఈ యేడాది చాగ‌ల్లు మండ‌లంలో జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే కాప‌వ‌రం జంక్ష‌న్‌లో బ్రాంచ్ ఏర్పాటు చేశారు.


గోదావ‌రి జిల్లాల్లో ప‌లు ప్రాంతాల నుంచి బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాల‌ని స్వ‌యంగా విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి ఉందంటే తిరుమ‌ల క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. తిరుమ‌ల‌కు రెండేళ్ల క్రితం ఆల్ ఇండియా నీట్‌లో 5వ ర్యాంక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సంస్థ నుంచి 3800 కు పైగా ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌కు ఎంపికైతే.. 1300 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఎయిమ్స్‌లోనూ ప‌దుల సంఖ్య‌లో తిరుమ‌ల విద్యార్థులు సీట్లు సాధించారు. తాజాగా తిరుమ‌ల ఏపీ పాలిటెక్నిక్‌, ఏపీఆర్‌జేసీలోనూ అద‌ర‌గొట్టేసింది. దీంతో అటు తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ నుంచి... ఇటు ఏపీలో అనంత‌పురం.. టు ఇటు శ్రీకాకుళం వ‌ర‌కు ఇప్పుడు త‌ల్లిదండ్రుల విద్యార్థుల చూపంతా రాజ‌మండ్రి తిరుమ‌ల వైపే ఉంది.


ఏపీ పాలిటెక్నిక్ - 2005లో సంచ‌ల‌న రికార్డులు :
ఈ యేడాది టెన్త్ ఫ‌లితాలు, సీనియ‌ర్ ఇంట‌ర్‌, జూనియ‌ర్ ఇంట‌ర్ ఫ‌లితాల్లో దుమ్ము దులిపేసిన తిరుమ‌ల విద్యార్థులు తాజాగా ఏపీ పాలిటెక్నిక్‌, ఏజీఆర్‌జేసీ ఫ‌లితాల్లో రికార్డులు బ్రేక్ చేస్తూ తిరుమ‌ల‌ను అగ్ర‌భాగాన నిలుపుతూ మ‌రోసారి త‌మ సంస్థ‌కు తిరుగులేని నిరూపించారు. పాలిటెక్నిక్‌లో న‌లుగురు విద్యార్థుల‌కు 120 మార్కుల‌కు 120 మార్కులు వ‌చ్చాయి. 13 మంది విద్యార్థుల‌కు 119, 22 మంది విద్యార్థుల‌కు 118, 35 మందికి 117, 50 మంది విద్యార్థుల‌కు 116 మార్కులు వ‌చ్చాయి.


ఏపీఆర్జేసీలో స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ తిరుమ‌ల‌దే...
ఇక ఏపీఆర్జేసీ 2005 ఫ‌లితాల్లో తిరుమ‌ల విద్యార్థులు రికార్డులు బ్రేక్ చేస్తూ బైసీసీ విభాగంలో ఏకంగా స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్‌తో త‌మ‌కు తామే సాటి అనిమ‌రోసారి ఫ్రూవ్ చేసుకున్నారు. బి. మ‌నోజ్‌కుమార్ ఈ రికార్డు సాధించ‌గా... ఎంపీసీ విభాగంలో స్టేట్ 3, 6, 8, 9 ర్యాంకులు కొల్ల‌గొట్టారు. ఇక స్టేట్ ర్యాంకులు 50 లోపు 28 మంది విద్యార్థుల‌కు రాగా, 100 లోపు 55 ర్యాంకులు కూడా తిరుమ‌ల విద్యార్థుల సొంత‌మ‌య్యాయి. 1000 లోపు 252 ర్యాంకుల్లోనూ తిరుమ‌ల విద్యార్థులే ఉన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

నోట్ : వ్య‌క్తిగ‌త, కుటుంబ స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: