
కానీ ఏం లాభం.. భార్య దువ్వాడ వాణిని విభేదించడం, స్థానిక వైసీపీ మహిళా నేత దివ్వెల మాధురితో కలిసి ఉండటం, వాణి ఇంటి ముందు నిరసకు దిగడం, వీరి కుటుంబ వ్యవహారం రోడ్డుకి ఎక్కించడంతో దువ్వాడ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. అయితే వాణి తన నిరసన విరమించుకోవడంతో.. దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరింత రెచ్చిపోయారు. ఇన్‌స్టా రిల్స్, తిరుమలలో ఫోటోషూట్స్, ఇంటర్వ్యూల్లో ముద్దులు హగ్గులు అంటూ రచ్చ రచ్చ చేశారు. ఫలితంగా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయనే కారణంతో దువ్వాడను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది.
అప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ జగన్‌నే నా దేవుడు అంటూ హుందాగా స్పందించాడు. ఇకపోతే వైసీపీ నుంచి దువ్వాడ అవుట్ అయ్యాక.. ఆయన సతీమణి దువ్వాడ వాణి యాక్టివ్ అయ్యారు. ఆమె రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. 2004లో కాంగ్రెస్ లో చేరి తన పొలిటికల్ కెరీర్ కు నాంది పలికారు. ఆ పార్టీని నుండి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు.
ఇంతకుముందు టెక్కలి వైసీపీ ఇంచార్జ్ పెరాడ తిలక్ వెనుకున్న వాణి.. ఇప్పుడు సపరేట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అందుకు తగ్గట్లే పార్టీలో ఆమె సముచితమైన గౌరవం దక్కుతోంది. దాంతో టెక్కలి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో కార్యకర్తల ఫంక్షన్లు, పరామర్శల్లో వాణి చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. టెక్కలిలో వైసీపీ తరఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా నియోజకవర్గం స్థాయి సమావేశంలోనూ వైసీపీ పెద్దలతో వాణి దర్శనమిచ్చారు. మొత్తంగా వాణి తీరు చూస్తోంటే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.