
అప్పటినుంచి కేకే సర్వే అంటే ఒక బ్రాండ్ గా మారిపోయింది. అయితే ఈ సర్వే అధినేత కిరణ్ కొండేటి తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నాడి కచ్చితంగా అంచనా వేసి గత ఎన్నికల ఫలితాలను కరెక్టుగా చెప్పిన సర్వే కేకే సర్వే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది తమ పాలన పైన ఇలా ఉంది అంటూ పంచుకున్నారు.. తాజాగా పారావిల్ అనే తమ నూతన రియల్ యాప్ ను ప్రారంభిస్తున్న సమయంలో కిరణ్ కొండేటి మాట్లాడుతూ జూన్ 4వ తేదీ అంటే తమ సంస్థకు చాలా ప్రత్యేకమైన రోజు అంటూ వెల్లడించారు.
గత ఏడాది ఇదే రోజున తమ సర్వే ఫలితాలు చెప్పినవి అక్షరాల నిజమయ్యాయి కూటమి విజయాన్ని అందుకుంది.. ప్రజల నాడిని మా సర్వే ద్వారా తెలియజేశాము అంతేకాని తాము ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయలేదు వ్యతిరేకించలేదంటూ తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న డేటా ప్రకారం.. 19 మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నదంటూ తెలియజేశారు కిరణ్ కొండేటి. అయితే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అన్న విషయం మాత్రం చెప్పలేదు.. అయితే చాలామంది మాత్రం కూటమి ఎమ్మెల్యేల పైనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైసిపి కార్యకర్తలు కూడా కూటమి ఎమ్మెల్యేలని ప్రజలు తిడుతున్నారంటు కామెంట్స్ చేస్తున్నారు.అలాగే కూటమిలో మద్దతు ఇచ్చే వారిలో 7% .. వైసిపి మద్దతుదారులలో 21 శాతం మంది జూనియర్ ఎన్టీఆర్ సీఎంగా కావాలని తెలిపారట.