
అయితే.. రోజులు అన్నీ ఒకేలా ఉండవు. అన్ని సందర్భాలూ ఒకే లా కూడా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు మరో చిక్కు వచ్చింది. అదే నాగాలమ్మ ఆలయం కూల్చివేత వ్యవహారం. ఇది జరిగి నాలుగు రోజులు అయింది. అయినా.. ఇప్పటి వరకు పవన్ స్పందించలేదు. సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో తాను ముందుంటానని చెప్పిన పవన్ ఎందుకు స్పందించలేదన్నది నెటిజన్ల నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఆయన చుట్టూ నాగాలమ్మ ఆలయం వ్యవహారం చుట్టుముట్టింది.
ఏం జరిగింది ..
తిరుపతి రూరల్ మండలంలోని దామినీడులో నాగాలమ్మ ఆలయం ఉంది. దీనికి చుట్టుపక్కల వాళ్లే కా కుండా.. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా.. వస్తుంటారు. అయితే.. దీనిని ఇటీవల కొందరు కూల్చి వేశారు. కుటుంబ కలహాల కారణంగానే ఇది కూల్చి వేసినట్టు తెలుస్తోంది. భూవివాద నేపథ్యంలో స్థానికం గా ఈ గుడిని కృష్ణమూర్తినాయుడు అనే వ్యక్తి నేలమట్టం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు అడ్డుకున్నారు. కృష్ణమూర్తి వర్గం తిరగబడటంతో కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు జరిగాయి.
ఈ వ్యవహారం తొలి రోజు సైలెంట్‌గానే ఉన్నా.. తర్వాత దీనికి రాజకీయ రంగు పులుముకుంది. దీంతో స నాతన ధర్మ పరిరక్షకుడిగా పేరు తెచ్చుకున్న పవన్ స్పందించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తు న్నారు. ఇంత జరిగినా.. ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు.. తిరుమలపైనా ఆరోపణలు పెరుగుతున్నాయి. గత రెండు మాసాల్లో మద్యం, లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వచ్చాయి. అయినా.. పవన్ స్పందించలేదు. దీంతో ఈ రెండు వ్యవహారాలపై ఆయన స్పందిస్తారో లేదో చూడాలి.