
ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. సబర్బన్ టికెట్ ధరలతో పాటు 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణానికి ఈ పెంపు వర్తించదని తెలుస్తోంది. 500 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్ కు ఒక పైసా చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్ కు సంబంధించి రైల్వే శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తత్కాల్ టికెట్ కు సంబంధించి రైల్వే శాఖ తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆధార్ ధ్రువీకరణ ఉన్నవాళ్లకు తత్కాల్ టికెట్లను బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. జులై నెల 1వ తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి రానుందని సమాచారం అందుతోంది. అదే రోజు నుంచి ఈ టికెట్ రేట్ల పెంపు సైతం జరగనుందని తెలుస్తోంది. అయితే టికెట్ రేట్లు పెరిగినా నెలవారీ సీజన్ టికెట్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని సమాచారం అందుతోంది.
రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి మిశ్రమ అభిప్రాయాలూ వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రైల్వే శాఖ భవిష్యత్తు నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. రైల్వే శాఖా జనరల్ బోగీలను సైతం పెంచాలని అదే సమయంలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఐతే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.