
ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ కూతురు అమూల్య, రవికుమార్ దంపతుల కొడుకు అయిన రేంజర్లవార్ వియాన్ ఈ ఘనతను సొంతం చేసుకోవడం గమనార్హం. నిజామాబాద్ లోని సీతారాం నగర్ కాలనీలో నివాసం ఉండే రవికుమార్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. అతని భార్య అమూల్య గృహిణిగా ఉన్నారు.
వియాన్ కు ఏడాది వయస్సు ఉన్న సమయంలోనే అమూల్య దేశంలోని వివిధ రాజధానుల పేర్లు నేర్పిస్తున్నారు. బాలుడు సైతం ఏ రాష్ట్ర రాజధాని పేరును అడిగినా క్షణాల్లో చెప్పేస్తున్నాడు. ఈ విషయం వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల దృష్టికి రాగా మే నెలలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి చిన్నారి ప్రతిభను పరీక్షించడం జరిగింది. కేవలం 41 సెకన్లలో 29 రాష్ట్రాల రాజధానుల పేర్లను చెప్పి ఆ ప్రతినిధులను ఆశ్చర్యంలో ముంచెత్తారని సమాచారం అందుతోంది.
వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ గురువారం రోజున అందిందని వియాన్ తల్లీదండ్రులు వెల్లడించడం గమనార్హం. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న చిన్నారి వియాన్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు. వియాన్ చిన్న వయసులోనే సాధించిన విజయాల గురించి నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. వియాన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు