
ఒకేసారి 14 రాష్ట్రాలకు బిజెపి కొత్త అధ్యక్షులను సైతం ఎన్నుకోవడానికి బిజెపి పార్టీ సిద్దమయింది. ఇందులో భాగంగా జులై 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్ష ఎన్నిక కూడా జరగబోతోంది. అయితే ఈసారి రాష్ట్ర బిజెపి అధ్యక్షత పదవిలో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో నేతల విషయానికి వస్తే సుజనా చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, పివి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల పేర్లు ప్రస్తుతం ఏపీ అధ్యక్ష రైసులో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అయితే రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నటువంటి పురందేశ్వరి మరొకసారి ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్న విషయం జులై ఒకటవ తేదీన తెలియబోతోంది. పార్టీ అధిష్టానంలో కూడా ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. పురందేశ్వరి బిజెపి పార్టీ అధ్యక్షత వ్యవహరిస్తున్నప్పుడు క్రమంగా ఓటు బ్యాంకు కూడా పెరిగిందనే వాదన కూటమిలో వినిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో వేరువేరు సామాజిక వర్గాలలో బలోపేతం చేయడానికి బిజెపి పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కాపు, రెడ్డి, బ్రాహ్మణ, బిసి, విలయ సామాజిక వర్గానికి చెందిన నేతల మద్దతు వంటి అంశాల పైన కూడా కేంద్ర ప్రభుత్వం చాలా లోతుగానే విశ్లేషిస్తోందట. 2029 అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు వేసేలా బిజెపి పార్టీ ప్లాన్ చేస్తాను. 2023 జూలైలో బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి రెండేళ్ల పాటు అధ్యక్షత పదవిలో ఉన్నారు. జులై 1వ తేదీన ఏం జరుగుతుందో చూడాలి.