
మరొకవైపున సోషల్ మీడియా మత్తులో రీల్స్ వీడియోలు వంటివి తీసుకోవడం కోసం.. ఐఫోన్ కోసం ఇద్దరు మైనర్లు.. మరొక మైనర్ ను చంపేశారు. ఇప్పుడు మరొక ఇన్సిడెన్స్ చూసుకుంటే.. నిద్రిస్తున్న తల్లి మీద పెట్రోల్ పోసి మరి నిప్పంటించారు ఒక కుమారుడు. ఆ తల్లి అకౌంట్లో ఉన్న డబ్బులు ఇవ్వట్లేదని ఇలా చేశారట. ఇలాంటి సంఘటనలన్నీ కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి..గతంలో తల్లిదండ్రులు అంటే చాలా గౌరవము, భక్తి ,అలాగే పనుల పట్ల శ్రద్ధ, కుటుంబ పనుల పట్ల శ్రద్ధ పాత జీవన విధానం సాగిస్తూ ఉండేవారు.
మన పూర్వము నుంచి తల్లిదండ్రులు నేర్పిస్తున్న పనులు ఏమిటంటే ఇంటిలో పనులన్నీ కూడా బిడ్డలు చేయాలని.. చిన్నప్పటినుంచి ఇంటి పనులలో ,వంట పనులలో ఇతర పనులలో ఆడపిల్లలు సహకరిస్తే.. బయట పనులలో మగపిల్లలు సహకరించేవారు. అయితే ప్రతి పనులలో కూడా తల్లితండ్రుల గౌరవాన్ని పెంచేటువంటి కాన్సెప్ట్ ఉండేది.. పల్లెలలో కూడా కొంచెం తేడా ఉన్నా సరే చుట్టుపక్కల వాళ్ళు గుర్తించి మరి తల్లిదండ్రులకు చెప్పేవారు. ఉమ్మడి కుటుంబంలో సభ్యులు కూడా తమ కుటుంబంలోని వ్యక్తి తప్పుడు దావపడుతూ ఉంటే దండించేవారు. వ్యక్తి కుటుంబాలు వచ్చాక వ్యక్తి స్వేచ్ఛ అనేటువంటిది బాగానే ఉన్న.. అది స్వార్థం వైపుకు వైపుకు పోయింది. అతి ఆస్వాదన వైపుకు వెళ్ళిపోయింది.. చివరికి ఎలాంటి తప్పు చేసిన సరే బ్రతికేయొచ్చు అనే స్థాయికి వెళ్ళిపోయింది.. లగ్జరీగా లైఫ్ మనం కోరుకున్నట్టు లేకపోతే ఎదుటోళ్లను కూడా బ్రతకనివ్వకూడదు అన్న స్టేజ్ కి మారిపోయింది.. పిల్లల పెంపకంలో ఈ తరంలో జరుగుతున్నటువంటి లోపం అత్యంత ప్రమాదకరమైనది.. మార్పు అనేది పెంపకంలో కాదు పెంచే తల్లితండ్రులలో రాకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదమే.