- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్లో కూటమిలో మొత్తం మూడు పార్టీలు ఉన్నాయి. ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశంతో పాటు జనసేన - బిజెపి కూడా కూటమిలో భాగస్వాములు గా ఉన్నాయి. కూట‌మి లో ఉన్న మూడు పార్టీలు ఫార్ములా రూపొందించుకొని ఆ క్రమంలో పదవులు పంచుకుంటున్నాయి. అయితే త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే తమకు ఎక్కువ వాటా కావాలని బిజెపి అప్పుడే రాజకీయాలు ప్రారంభించేసింది. ఇప్పటికే పెద్దలు అడిగారని రాజ్యసభ - ఎమ్మెల్సీ సీట్లు బిజెపికి ఇచ్చారు. ఇప్పుడు బిజెపి నేతలు లోకల్ పదవులు స్థానిక ఎన్నికలలో సీట్లపై దృష్టి పెట్టారు. ఐదు శాతం అంటూ ఏపీ బీజేపీ నేతలు కొత్తరాగం అందుకున్నారు. పార్టీ కోసం కష్టపడి నేతలు అవకాశాలు కల్పించాలని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేస్తున్నారు. బిజెపి కోసం ఎంతమంది కష్టపడ్డారో ? ఎలా కష్టపడ్డారో కానీ వారి కంటే ఎక్కువగా టిడిపి - జనసేన నేతలు కష్టపడ్డారు.


వారికి అన్యాయం చేసి బిజెపికి వాటా పెంచాలని విష్ణుకుమార్ రాజు కోరుతున్నట్టుగా ఉంది. గతంలో బిజెపి ఒంటరిగా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తే పట్టుమని పది పంచాయతీలు గెలుచుకోలేకపోయింది. ఒక్క ఎంపీపీ కూడా ఛాన్స్ లేదు. కార్పొరేటర్లు కూడా లేరు. వ్యక్తిగత బలంతో కొన్నిచోట్ల కౌన్సిలర్లు గెలిచారు. అంత ఎందుకు స్వయంగా ఏపీ బీజేపీలో ఆ పార్టీ టాప్ నేతలు ఒక్క‌రు కూడా సొంతంగా ఏ ఎన్నికల్లోను విజయం సాధించలేదు. ఇప్పుడు కూటమి ని అడ్డం పెట్టుకుని ఇతర పార్టీల బలంతో తమ పార్టీకి పదవులు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: