- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో విద్యాశాఖలో నారా లోకేష్ మార్క్ సంస్క‌ర‌ణ‌ల పరంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా ఇంటర్ విద్యలో యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేష్)  ఎన్ రోల్ మెంట్ ను సమర్థవంతంగా చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 5,00,965 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఇంటర్ లేదా వృత్తి విద్యా కోర్సుల్లో తప్పనిసరిగా ప్రవేశం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ విద్యార్థి ఇంట్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి ఎక్కడ ప్రవేశం పొందారో ట్రాక్ చేయాలని, పాఠశాల విద్యతోనూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.


రాష్ట్రంలో నిరక్షరాస్యులకు అక్షర ఆంధ్ర (ప్రాజెక్ట్ అఆ) కార్యక్రమం ఆగష్టు 7వ తేదీ నుంచి ప్రారంభించనన్నట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రతి ఏడాది ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా లాంగ్వేజ్ సబ్జెక్ట్ మార్కులను మిగతా సబ్జెక్టుల మార్కుల సగటుగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయరామరాజు, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: