
అయితే ఇప్పుడు తాజాగా మరొక విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే.. బిజెపి పార్టీకి సంబంధించి బిజెపి పార్టీ వాళ్లు తమను పట్టించుకోవడం లేదంటూ ఒక జనసేన నాయకుడు ప్రశ్నిస్తున్నారు. టిడిపి పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొవ్వూరు ప్రాంతానికి చెందిన టీవీ రామారావు ఆవేదనను తెలుపుతున్నారు. ఆ తర్వాత టిడిపి టికెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీలోకి చేరారు. పురందేశ్వరి తన ప్రాంతానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు వేయించుకుంటూ తమని పట్టించుకోలేదంటూ ఆవేదనను తెలిపారు.
టిడిపి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తనని నిర్లక్ష్యం చేస్తోందని.. తనని నామినేటెడ్ పోస్టుకి అనర్హుడిని చేసిందంటూ టీవీ రామారావు మాట్లాడుతూ తనని బిజెపి అన్యాయం చేసిందంటూ జనసేన తరపున ప్రస్తుతం ఉన్న మాజీ టిడిపి ఎమ్మెల్యే రామారావు ఆందోళనకు దిగడం ర్యాలీగా వెళ్లడం అన్నది ఇప్పుడు ఏపీ అంతట వైరల్ గా మారింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితిని అటు కూటమి అధినేతలు సర్ది చెబుతారా లేకపోతే సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారని విషయం చూడాలి మరి. అయితే ఇప్పటికే చాలామంది నేతలు మధ్య కూడా సఖ్యత కనిపించడం లేదని కొన్ని సందర్భాలలో బయటపడుతూనే ఉంది.అయినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు వీరందరిని హెచ్చరిస్తూ ముందుకు వెళుతున్నారు.