
సోషల్ మీడియాలో సైతం పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతూ ఉండటం గమనార్హం. ఒక వ్యక్తిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన కోరడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీని విమర్శించిన వాళ్ళ విషయంలో జనసేన ఒకింత కఠినంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. జనసేన నియంతృత్వ ధోరణి పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టం చేకూర్చుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జనసేన సోషల్ మీడియా జనాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయం కూడా ఫైర్ అవుతున్నారు. జనసేన ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. జనసైనికులు కూటమి పాలనను విమర్శించకూడదని నెటిజన్లు సైతం ఫీలవుతున్నారు. హిందీ గురించి పవన్ చేసిన కామెంట్ల విషయంలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రంలో బీజేపీతో బంధం మరింత బలపడాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ ఈ విధంగా వ్యవహరిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ సోషల్ మీడియాలో టార్గెట్ కావడం ఆయన వీరాభిమానులు బాధ పెడుతోంది. పవన్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ ఉండటం గమనార్హం
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు