
రాజా సింగ్ అంటే బిజెపి జాతీయ నాయకత్వానికి మాత్రమే కాదు .. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న హిందుత్వ వాదులకు కూడా చాలా ఇష్టం. అలాగే ఇతర పార్టీలలో ఉన్నవారు సైతం రాజాసింగ్ ను అభిమానిస్తారు. పాతబస్తీలో మజిలీస్ ను ఢీకొట్టి గోషామహల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. మరి ముఖ్యంగా 2018లో తెలంగాణలో బిజెపి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కావటం విశేషం. తాజాగా ఆయన రాజీనామాను బిజెపి ఆమోదించింది. ఆయన భావజాలం బిజెపి తట్టుకోలేకపోతుందని .. ఆయన క్రమశిక్షణ లేనితనాన్ని భరించలేకపోతుందని .. ఇక ఆయన సేవలో బిజెపికి అవసరం లేదని జాతీయ అగ్రనాయకత్వం నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. రాజాసింగ్ తన రాజీనామాను ఆమోదించకుండా ఎవరైనా తనను బుజ్జగిస్తే బాగుంటుందని భావించినట్టు ఉన్నారు. రెండురోజులుగా ఆయన స్పందిస్తూ వస్తున్నారు. ఓవైసీ కాలేజ్ కూల్చాలని తెలంగాణ బిజెపి శాఖ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుకు విజ్ఞప్తి చేశారు.
గతంలో తాను గట్టి విమర్శలు చేసిన బండి సంజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి కొంత మంది పెద్దలను కలిసే ప్రయత్నం కూడా చేశారని అంటున్నారు. రాజాసింగ్ బెదిరింపులు చేయటం ఇది మొదటిసారి కాదు .. గతంలో రెండు సార్లు రాజీనామాలు చేసిన ఆయనను బుజ్జగించారు. ఓసారి సస్పెండ్ చేసిన తెలంగాణకు చెందిన సొంత పార్టీ నేతలు టిక్కెట్ ఇవ్వవద్దని చెప్పినా .. మళ్లీ పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చారు. అయితే ఈసారి భరించలేమని తేల్చి చెబుతూ ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజాసింగ్ ను భరించడం కష్టమని కిషన్ రెడ్డి తో పాటు ఇతర నేతలు హైకమండ్‌కు చెప్పడంతో రాజీనామా ఆమోదించేశారు. ఇప్పుడు రాజాసింగ్ ఏ పార్టీలోనే చేరలేరు. ఆయనను ఏ పార్టీ కూడా చేర్చుకునే రిస్క్ చేయలేదు. ఆయన పార్టీలో ఉంటే చాలా వర్గాలు దూరం అయిపోతాయి అన్న భయం అన్ని పార్టీలలో ఉంది. ఏది ఏమైనా రాజాసింగ్ తొందరపాటుతో రోడ్డున పడ్డారని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు