
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల టార్గెట్ ఈసారి 225 సీట్లకు మారిపోయింది. 2029లో కూడా కూటమిలో భాగంగానే అటు జనసేన, టిడిపి ,బిజెపి పార్టీలు పోటీగా దిగబోతున్నాయి. చాలామంది సీనియర్స్ కూడా టిడిపి పార్టీ నుంచి రిటైర్మెంట్ ఇచ్చి తమ వారసులకు టికెట్లు ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారట. కూటమిలో జనసేన పార్టీకి ఈసారి 50 సీట్లకు తక్కువ లేకుండా ఉండేలా అనేతలు పోటీ అలాగే బిజెపి పార్టీకి కూడా ఈసారి ఎక్కువ స్థానాలను తీసుకునేలా కనిపిస్తున్నారు. అందుకే కొంత కొంతమంది నేతలు జనసేనలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.
వైసిపి పార్టీ మాత్రం 2029 ఎన్నికలలో గెలుస్తామని ధీమాతో చాలా ఉన్నారు. కూటమి నేతలు చెప్పిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని.. ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల అరాచకాలకు అడ్డగా మారిపోయిందంటూ ఇప్పటికే వైసిపి నేతలు తెలియజేస్తున్నారు. అదే ధీమాతో గెలుస్తామని మాట్లాడుతున్నారు.మరి ఇలాంటి సమయంలో 2029లో కనుక 225 సీట్ల వరకు చేరితే ఎవరికీ బాగా కలిసొస్తుందో చూడాలి. మరి నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పూర్తి వివరాలు త్వరలోనే బయటికి వస్తాయని చూడాలి మరి. మొత్తానికి ఏపీలో సీట్ల పెంపు హాట్ టాపిక్ గా మారుతున్నది.